Amith Shah: పాకిస్థాన్‌కి భయపడుతోన్న కాంగ్రెస్.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - May 28 , 2024 | 06:54 PM
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లేదని.. పాకిస్థాన్ అంటే ఆ పార్టీ భయపడుతోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) సంచలన విమర్శలు చేశారు.
భువనేశ్వర్: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లేదని.. పాకిస్థాన్ అంటే ఆ పార్టీ భయపడుతోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) సంచలన విమర్శలు చేశారు. ఒడిశాలోని(Odisha) జాజ్‌పూర్‌లో ఎన్నికల ర్యాలీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ..
"కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్‌లో అణుబాంబు ఉందని చెబుతోంది. పీఓకే గురించి మాట్లాడొద్దని అంటోంది. నవీన్ బాబు (ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్), రాహుల్ బాబా (కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ) పీఓకే విషయంలో భయపడుతున్నారు. పీఓకే భారత్‌కి చెందింది దాన్ని మేం వెనక్కి తీసుకుంటాం" అని షా స్పష్టం చేశారు. లక్షలాది మంది ఒడిశా యువకులు పని వెతుక్కుంటూ ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని పేర్కొన్న హోంమంత్రి, డబల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటయ్యాక యువత వేరే చోట ఉద్యోగాల కోసం వెళ్లాల్సిన అవసరం లేకుండా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
జూన్ 4 తర్వాత ఒడిశా మాజీ సీఎంగా నవీన్..
147 మంది సభ్యుల అసెంబ్లీలో 75 సీట్లకు పైగా సాధించడం ద్వారా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని షా ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4 తర్వాత ఒడిశా నవీన్ మాజీ సీఎం అవుతారని(Naveen Patnaik) షా ఎదురు దాడి చేశారు. రాష్ట్రంలోని 21 లోక్‌సభ స్థానాల్లో 17 స్థానాలను కాషాయ పార్టీ గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు."జూన్ 4న నవీన్ బాబు ముఖ్యమంత్రిగా ఉండరు.
మాజీ సీఎం అవుతారు. ఒడిశాలో 17 లోక్‌సభ స్థానాలు, 75 అసెంబ్లీ నియోజకవర్గాలను బీజేపీ గెలుచుకోవడం ఖాయం" అని షా అన్నారు. తదుపరి ముఖ్యమంత్రి ఒడియాలో అనర్గళంగా మాట్లాడగలరని, రాష్ట్ర భాష, సంస్కృతీసంప్రదాయాలను అర్థం చేసుకునే వ్యక్తిని బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రకటిస్తుందని తెలిపారు.
For More National News and Telugu News..
Updated Date - May 28 , 2024 | 06:59 PM