Share News

Rahul Gandhi: ఈవీఎంలపై అనుమానాలు.. ఎన్నికల ప్రక్రియలో లోపాలపై ప్రశ్నలు సంధించిన రాహుల్..

ABN , Publish Date - Jun 16 , 2024 | 02:33 PM

దేశంలో ఎన్నికలు ముగిశాయి. ప్రజల తీర్పు వెలువడింది. ఫలితాలతో ఈవీఎంల వివాదానికి తెరపడిందని అంతా భావించారు. కానీ ఈవీఎంలపై మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ విషయంలో కాంగ్రెస్ కేంద్రప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది.

Rahul Gandhi: ఈవీఎంలపై అనుమానాలు.. ఎన్నికల ప్రక్రియలో లోపాలపై ప్రశ్నలు సంధించిన రాహుల్..
Rahul Gandhi

దేశంలో ఎన్నికలు ముగిశాయి. ప్రజల తీర్పు వెలువడింది. ఫలితాలతో ఈవీఎంల వివాదానికి తెరపడిందని అంతా భావించారు. కానీ ఈవీఎంలపై మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ విషయంలో కాంగ్రెస్ కేంద్రప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పలు ప్రశ్నలు సంధించారు. ఈవీఎంను బ్లాక్‌బాక్స్‌గా అభివర్ణించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ముంబైలో ఎన్డీయే తరపున శివసేన నుంచి పోటీచేసిన రవీంద్ర వైకర్ బంధువు మొబైల్ ఫోన్ ఈవీఎంకు లింక్ చేశారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రవీంద్ర వైకర్ కేవలం 48 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో ఈ ఘటనను ప్రస్తావిస్తూ ఈవీఎంలపై కాంగ్రెస్ పలు అనుమానాలను లేవనెత్తుతోంది. రాహుల్ గాంధీ ఎన్నికల సంఘాన్ని పలు ప్రశ్నలు సంధించారు.

Amit Shah : జమ్ము కాశ్మీర్‌‌‌లో శాంతి భద్రతలపై సమీక్ష


బ్లాక్ బాక్స్‌ అంటూ..

భారత్‌లోని ఈవీఎంలు బ్లాక్ బాక్స్ అని, వాటిని చెక్ చేయడానికి ఎవరికీ అనుమతి లేదని రాహుల్ గాంధీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయన్నారు. ఎన్నికల సంఘం తక్షణమే వీటిపై దృష్టిసారించాలని, ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. వ్యవస్థల్లో జవాబుదారీతనం లోపిస్తే ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదమని రాహుల్ పేర్కొన్నారు.


ఎన్నో అనుమానాలు..

ముంబై నార్త్‌వెస్ట్ లోక్‌సభ స్థానం శివసేన అభ్యర్థి రవీంద్ర వైకర్ బంధువు మొబైల్ ఫోన్ ఈవీఎంకు ఎందుకు కనెక్ట్ చేశారని.. ఓట్ల లెక్కింపు జరుగుతున్న ప్రదేశానికి మొబైల్ ఫోన్ ఎలా వచ్చిందని ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఈ ఘటనపై ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని కోరింది.


48 ఓట్ల తేడాతో

ఫోన్‌ను ఈవీఎంతో కనెక్ట్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు మంగేష్ పాండిల్కర్ ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ స్థానం నుంచి 48 ఓట్ల తేడాతో గెలిచిన శివసేన అభ్యర్థి రవీంద్ర వైకర్‌కు బంధువుగా మహారాష్ట్ర వానరాయ్ పోలీసులు దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రానికి అనుసంధానం చేసిన ఫోన్‌ను ఆయన ఉపయోగిస్తున్నారని.. జూన్ 4న నెస్కో సెంటర్‌లో ఉపయోగించిన ఈవీఎం మిషన్‌ను అన్‌లాక్ చేయడానికి ఓటీపీని రూపొందించడానికి ఈ మొబైల్ ఫోన్ ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఎన్నికలు పూర్తైన తర్వాత ఈవీఎంలపై కాంగ్రెస్ మరోసారి అనుమానాలు లేవనెత్తడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


Ooty: ఊటీ కొండ రైలుకు 125 వసంతాలు పూర్తి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Jun 16 , 2024 | 02:33 PM