ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

delhi : మోదీ ముక్త్‌ దివస్‌గా జూన్‌ 4

ABN, Publish Date - Jul 13 , 2024 | 04:28 AM

దేశంలో ఎమర్జెన్సీ విధించిన 1975 జూన 25ను ‘సంవిధాన్‌ హత్యా దివస్‌’ (రాజ్యాంగ హత్యా దినం)గా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంపై శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర నిరసన తెలిపింది.

  • ‘రాజ్యాంగం హత్య’ ఏమిటి..?

  • అంబేడ్కర్‌ను అవమానించడమే: ఖరే

న్యూఢిల్లీ, జూలై 12: దేశంలో ఎమర్జెన్సీ విధించిన 1975 జూన 25ను ‘సంవిధాన్‌ హత్యా దివస్‌’ (రాజ్యాంగ హత్యా దినం)గా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంపై శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర నిరసన తెలిపింది. పత్రికల్లో పతాక శీర్షికల కోసం ప్రధాన మోదీ ప్రదర్శిస్తున్న కుటిలనీతి అని విమర్శించింది.

నిజానికి వ్యక్తిగతంగా, రాజకీయంగా నైతిక ంగా మోదీ ఓడిపోయిన రోజైన 2024 జూన్‌ 4వ తేదీయే (లోక్‌సభ ఫలితాలు వెల్లడయిన రోజు) చరిత్రలో మోదీ ముక్త్‌ దివ్‌సగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్‌ చేస్తూ ‘రాజ్యాంగం’ అన్నది పవిత్రమైన పదమని, దాన్ని ‘హత్య’ చేయడం అంటే అంబేడ్కర్‌ను అవమానించడమేనని విమర్శించారు.

నోట్లను రద్దు చేసిన 2016 నవంబరు 8వ తేదీని ‘ఆజీవక హత్యా దివ్‌స’గా పరిగణిస్తామని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం గత పదేళ్లుగా ప్రతి రోజూ రాజ్యాంగాన్ని హత్య చేస్తునే ఉందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ట్వీట్‌ చేస్తూ.. దేశంలో గత పదేళ్లుగా అప్రకటిత అత్యయిక పరిస్థితి అమలవుతూనే ఉందన్నారు. ‘మానవేతర ప్రధాని’ ఒక పద్ధతి ప్రకారం రాజ్యాంగ విలువలు, సిద్ధాంతాలు, రాజ్యాంగ సంస్థలపై దాడి చేస్తునే ఉన్నారని ఆరోపించారు.

Updated Date - Jul 13 , 2024 | 04:28 AM

Advertising
Advertising
<