Share News

Delhi Liquor Scam Case: క్షణం క్షణం ఉత్కంఠ.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేజ్రీవాల్..

ABN , Publish Date - Mar 21 , 2024 | 07:51 PM

CM Kejriwal: దేశ రాజధాని ఢిల్లీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఓవైపు సీఎం కేజ్రీవాల్(CM Kejriwal).. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు(ED).. పరిస్థితి తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో(Delhi Liquor Scam Case) సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేస్తుందని గట్టి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. కేజ్రీవాల్ కీలక నిర్ణయం..

Delhi Liquor Scam Case: క్షణం క్షణం ఉత్కంఠ.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేజ్రీవాల్..
CM Arvind Kejriwal

CM Kejriwal: దేశ రాజధాని ఢిల్లీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఓవైపు సీఎం కేజ్రీవాల్(CM Kejriwal).. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు(ED).. పరిస్థితి తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో(Delhi Liquor Scam Case) సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేస్తుందని గట్టి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. తనను అరెస్ట్ చేయకుండా అడ్డుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. అయితే, తాము అడ్డుకోలేమని హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ అంశంపై అత్యవసరంగా విచారణ జరపాలంటూ కేజ్రీవాల్ తరఫున లీగల్ టీమ్.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరి దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని మరింత ఉత్కంఠ నెలకొంది.

లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవలే బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే కేసులో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. ఆయన నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు.. ఈడీ కార్యాలయం వద్ద కూడా 144 సెక్షన్ విధించారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితిని చూస్తే ఏక్షణం ఏం జరుగుతుందోనని ఉత్కంఠ యావత్ దేశ ప్రజలలో నెలకొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 21 , 2024 | 07:51 PM