Delhi: వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాల్సిందే.. కేజ్రీవాల్‌కు తేల్చిచెప్పిన న్యాయస్థానం
ABN, Publish Date - Mar 07 , 2024 | 11:01 AM
లిక్కర్ పాలసీలో విచారణకు సంబంధించి ఆఫ్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల మధ్య దోబూచులాట కంటిన్యూ అవుతూనే ఉంది. విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీచేస్తూనే ఉంది. అసెంబ్లీ అని ఉందని, వ్యక్తిగత కారణాలు చూపుతూ కేజ్రీవాల్ మినహాయింపు కోరుతున్నారు. తాజాగా మరోసారి ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు.
ఢిల్లీ: లిక్కర్ పాలసీలో (Delhi Liquor Policy) విచారణకు సంబంధించి ఆఫ్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల మధ్య దోబూచులాట కంటిన్యూ అవుతూనే ఉంది. విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీచేస్తూనే ఉంది. అసెంబ్లీ అని ఉందని, వ్యక్తిగత కారణాలు చూపుతూ కేజ్రీవాల్ (Kejriwal) మినహాయింపు కోరుతున్నారు. తాజాగా మరోసారి ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. లిక్కర్ పాలసీ కేసులో తాము ఇచ్చిన సమన్లతో కేజ్రీవాల్ (Kejriwal) విచారణకు హాజరు కావడం లేదని స్పష్టం చేసింది. ఎనిమిదో సారి జారీచేసిన సమన్లకు సంబంధించి సోమవారం ఈడీ అధికారుల ముందు కేజ్రీవాల్ (Kejriwal) విచారణకు హాజరు కావాల్సి ఉంది. అంతకుముందు మూడు సమన్లకు సంబంధించి మార్చి 16వ తేదీన కోర్టులో విచారణ జరగనుంది. ఆ రోజున కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని అరవింద్ కేజ్రీవాల్‌కు స్పష్టం చేసింది.
కేజ్రీవాల్ వెర్షన్ ఇది
ఢిల్లీ లిక్కర్ పాలసీలో సమన్లకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల లేఖ రాశారు. అసెంబ్లీలో బలపరీక్ష ఉన్నందున విచారణకు హాజరు కాలేనని అందులో రాశారు. మార్చి 12వ తేదీ తర్వాత ఎప్పుడైనా విచారణకు సిద్ధం అని స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా కాకుండా వర్చువల్‌గా విచారణకు హాజరవుతానని కోరారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదనను ఈడీ అధికారులు తోసిపుచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు 8 సార్లు సమన్లు జారీచేశారు. ఏదో కారణం చెప్పి విచారణ నుంచి కేజ్రీ తప్పించు కుంటున్నారు. ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించడంతో.. న్యాయస్థానం వద్దకు కూడా రావడం లేదు. 16వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకు రావాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 07 , 2024 | 11:21 AM