Parliament : పార్లమెంట్ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ..
ABN, Publish Date - Dec 13 , 2024 | 09:57 AM
ఇవాళ మధ్యాహ్నం 12.00గంటలకు పలు కీలక అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించనున్నారు. బీజేపీ నుంచి 15-18 మంది ప్రసంగించనున్నట్లు సమాచారం. ఎమర్జెన్సీ, విపక్షాలు ప్రచారం చేస్తున్న తప్పుడు కథనాలు, కాంగ్రెస్ హయాంలోని చాలా రాజ్యాంగ సవరణలు వంటి పలు అంశాలను ఎన్డీయే లేవనెత్తే అవకాశం ఉంది.
ఢిల్లీ: లోక్‌సభలో రాజ్యాంగ దినోత్సవంపై ప్రత్యేక చర్చ జరగనుంది. చర్చను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. అనంతరం ఇవాళ(శుక్రవారం) మధ్యాహ్నం 12.00గంటలకు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. బీజేపీ నుంచి 15-18 మంది ప్రసంగించనున్నట్లు సమాచారం. ఎన్డీఏ మిత్రపక్షాల నుంచి హెచ్‌డీ కుమారస్వామి, శ్రీకాంత్ షిండే, శాంభవి చౌదరి, రాజ్‌కుమార్ సాంగ్వాన్, జితన్ రామ్ మాంఝీ, అనుప్రియా పటేల్, రాజీవ్ రంజన్ సింగ్, రామ్మోహన్ నాయుడు, బాలశౌరి తదితరులు ప్రసంగించే అవకాశం ఉంది.
ఎమర్జెన్సీ, విపక్షాలు ప్రచారం చేస్తున్న తప్పుడు కథనాలు, కాంగ్రెస్ హయాంలోని చాలా రాజ్యాంగ సవరణలు వంటి పలు అంశాలను ఎన్డీయే లేవనెత్తే అవకాశం ఉంది. చర్చ 2వ రోజు (డిసెంబర్ 14)న సాయంత్రం 5.00గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానం చెప్పనున్నారు. రాజ్యసభలో చర్చను హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు.. చర్చలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా కూడా మాట్లాడతారని పార్టీ వర్గాల సమాచారం.
కాగా.. జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. లోక్‌సభకు, దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులకు గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే వారం మొదటి రెండు రోజుల్లో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. రెండు బిల్లుల్లో మొదటిది లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు కాగా, రెండోది శాసనసభలున్న కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కశ్మీర్‌లకు ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన సాధారణ బిల్లు.
పార్లమెంటు ఉభయ సభల్లో కేవలం సాధారణ మెజారిటీ ఉన్న ఎన్డీయే ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లును నెగ్గించుకోవాలంటే తప్పనిసరిగా అద్భుతం చేయాలి. లేదా విపక్షాల సహకారాన్ని తీసుకోవాలి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం గురువారం నాటి క్యాబినెట్ సమావేశానికి సంబంధించి ఎలాంటి బ్రీఫింగ్ ఇవ్వలేదు. నోట్ కూడా విడుదల చేయలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేవలం ఉభయ సభల్లో బిల్లులను ప్రవేశపెట్టి, వెంటనే సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు పంపుతారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
ఈవార్తను కూడా చదవండి: Seethakka: చర్యలు తీసుకున్నా మీరు మారరా ?
ఈవార్తను కూడా చదవండి: సీఎం సారూ.. రుణమాఫీ చేసి ఆదుకోండి!
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ సంస్కృతిపై దాడి : బండి సంజయ్
ఈవార్తను కూడా చదవండి: అక్కా.. నేను చనిపోతున్నా
Read Latest Telangana News and National News
Updated Date - Dec 13 , 2024 | 10:02 AM