Share News

Viral News: ఘోరంగా మోసపోయిన స్టార్ హీరోయిన్ తండ్రి..

ABN , Publish Date - Nov 16 , 2024 | 01:46 PM

అత్యాశకు పోయి పలువురు మోసపోయిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. ఇక్కడ కూడా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తండ్రికి కూడా అలాగే జరిగింది. ప్రభుత్వ కమిషన్‌లో కీలక పదవి ఇస్తామని చెప్పి పలువురు లక్షల రూపాయలు లూటీ చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Viral News: ఘోరంగా మోసపోయిన స్టార్ హీరోయిన్ తండ్రి..
Disha Patani father Jagdish Singh

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ (disha patani) తండ్రి జగదీష్ సింగ్ పటానీ మోసానికి గురయ్యారు. ఐదుగురు వ్యక్తులు కలిసి రూ. 25 లక్షల వరకు మోసం చేశారు. ప్రభుత్వ కమీషన్‌లో ఉన్నత పదవి ఇప్పిస్తానని దుండగులు దిశా తండ్రికి హామీ ఇచ్చి చీట్ చేశారు. రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ అయిన దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీకి ప్రభుత్వ కమిషన్‌లో ఉన్నత పదవి ఇస్తామని హామీ ఇచ్చి రూ. 25 లక్షల మేరకు మోసం చేశారని బరేలీ పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ ఘటనపై శుక్రవారం సాయంత్రం బరేలీ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.


ఈ కేసులో

ఈ ఘటన నేపథ్యంలో జగదీష్ పటానీ బరేలీ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. ఇందులో శివేంద్ర ప్రతాప్ సింగ్, దివాకర్ గార్గ్, జునా అఖారాకు చెందిన ఆచార్య జైప్రకాష్, ప్రీతి గార్గ్ సహా మరో వ్యక్తి ఉన్నారు. ఈ కేసును మోసం, దోపిడీ కింద నమోదు చేశారు. ఈ విషయమై కొత్వాలి పోలీస్‌స్టేషన్‌ ఇంఛార్జీ మాట్లాడుతూ విచారణ జరుపుతున్నామని, నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దిశా తండ్రి జగదీష్ ప్రస్తుతం రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్‌గా ఉన్నారు.


ఈ పదవుల్లో

ప్రభుత్వ కమిషన్‌లో ఉన్నత పదవి ఇస్తామని హామీ ఇచ్చిన శివేంద్ర ప్రతాప్ గురించి దిశా తండ్రి పోలీసులకు సమాచారం అందించారు. ఆయనను దివాకర్ గార్గ్, ఆచార్య జైప్రకాష్‌లకు పరిచయం చేశాడు. ఈ వ్యక్తులు తమకు చాలా మంచి రాజకీయ సంబంధాలు ఉన్నాయని, ఈ విధంగా దిశా తండ్రికి ప్రభుత్వ కమిషన్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ వంటి కీలక పదవుల్లో నియమించడంలో సహాయపడతామని ఆరోపించారు. ఆ క్రమంలో శివేంద్రతోపాటు ఇతర వ్యక్తులు తనను రూ. 25 లక్షలు డిమాండ్ చేశారని జగదీష్ ఆరోపించారు.


డబ్బులు తీసుకుని బెదిరింపులు

అందులో రూ. 5 లక్షల నగదు, రూ. 20 లక్షలను మూడు వేర్వేరు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాలని కోరినట్లు జగదీష్ ఫిర్యాదులో తెలిపారు. వారి రాజకీయ సంబంధాలు నిజమని నిరూపించేందుకు నిందితులు హిమాన్షు అనే వ్యక్తిని పరిచయం చేశారని, తనను తాను స్పెషల్ డ్యూటీ అధికారిగా అభివర్ణించుకున్నారని జగదీష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ క్రమంలో మూడు నెలలుగా ఎలాంటి మార్పు లేకపోవడంతో జగదీష్ మళ్లీ డబ్బులు అడగడంతో నిందితులు బెదిరించడంతో పాటు అతనితో అసభ్యంగా ప్రవర్తించారని పోలీసు అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి:

Accident: పెళ్లి చేసుకుని తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదం.. తుక్కుతుక్కైన వాహనాలు, ఏడుగురు మృతి


Fire Accident: మెడికల్ కాలేజీలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది చిన్నారులు మృతి


PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 16 , 2024 | 02:23 PM