Sunita Kejriwal: ఎంపీ తప్పుడు స్టేట్‌మెంట్‌తోనే నా భర్త అరెస్టు.. వీడియో రిలీజ్ చేసిన సునీత కేజ్రీవాల్
ABN , Publish Date - Jul 06 , 2024 | 06:38 PM
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ అరెస్టుపై ఆయన భార్య సునీత కేజ్రీవాల్ కీలక విషయాలు వెల్లడించారు. ఇందుకు బంధించిన వీడియోను ఆమె శనివారంనాడు విడుదల చేశారు. ఎన్డీయే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తప్పుడు వాంగ్మూలం ఆధారంగానే లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిందని ఆ వీడియోలో ఆమె ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన భార్య సునీత కేజ్రీవాల్ (Sunita Kejriwal) కీలక విషయాలు వెల్లడించారు. ఇందుకు బంధించిన వీడియోను ఆమె శనివారంనాడు విడుదల చేశారు. ఎన్డీయే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి (MSR) తప్పుడు వాంగ్మూలం ఆధారంగానే లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిందని ఆ వీడియోలో ఆమె ఆరోపించారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 2022 సెప్టెంబర్ 22న ఎంఎస్ఆర్ నివాసంపై దాడి జరిపిందని, ఆసమయంలో కేజ్రీవాల్‌ను మీరు కలిసారా అని ఈడీ ప్రశ్నించిదని సునీత తెలిపారు. 2021 మార్చి 16న ఢిల్లీ సెక్రటేరియట్‌లోని సీఎం కార్యాలయంలో కేజ్రీవాల్‌ను తాను కలిసినట్టు ఎంఎస్ఆర్ బదులిచ్చారని చెప్పారు. ఢిల్లీలో ఫ్యా్మిలీ ఛారిటబుల్ ట్రస్టును ప్రారంభించేందుకు భూమి కోసం కేజ్రీవాల్‌ను ఎంఎస్ఆర్ కలిశారని, అయితే ఆ భూమి ఎల్జీ పరిధిలోకి వస్తుందని, ఆయనను కలిసి అప్లికేషన్ ఇవ్వమని కేజ్రీవాల్ చెప్పడంతో ఆ పని చూసుకుని ఆయన వెళ్లిపోయారని సునిత తెలిపారు. ఎంఎస్ఆర్ చెప్పిన జవాబు నచ్చకపోవడంతో ఆయనపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన కుమారుడు రాఘవ రెడ్డిని ఈడీ అరెస్టు చేసిందన్నారు. రాఘవకు బెయిల్ కూడా రాకుండా చేసిందన్నారు. ఆ సమయంలో రాఘవరెడ్డి భార్య, ఎంఎస్‌ఆర్ కోడలు ఆత్మహత్యా యత్నం చేయడం, తన కొడుకు పరిస్థితి చూసి ఎంఎస్ఆర్ కంటతడి పెట్టుకోవడం జరిగిందన్నారు. ఆ క్రమంలోనే 2023 జూలై 17న ఎంఎస్‌ఆర్ తన స్టేట్‌మెంట్‌ను మార్చుకున్నారని తెలిపారు. లిక్కర్ వ్యాపారం చేయమని, ఆప్‌కు రూ.100 కోట్లు ఇవ్వమని పది మంది సమక్షంలో కేజ్రీవాల్ అడిగినట్టు ఎంపీ స్టేట్‌మెంట్ ఇచ్చారని, ఆ తరువాత రెండ్రోజులకే రాఘవకు బెయిల్ వచ్చిందని సునీత గుర్తు చేశారు. దీనిని బట్టే ఎంపీ తప్పుడు వాంగ్మూలం ఇచ్చారని అర్ధమవుతోందన్నారు.
Swati Maliwal case: బిభవ్ కుమార్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
నా భర్తకు అండగా నిలబడండి..
నిజాయితీ, విద్యావంతుడు, దేశభక్తి కలిగిన కేజ్రీవాల్‌ను తప్పుడు కేసులో ఇరికించారని, ఆయనకు మద్దతుగా నిలవాలని ప్రజలను సునీత ఆ వీడియోలో కోరారు. ''రాజకీయ కుట్రలో కేజ్రీవాల్ బలి అయ్యారు. ఆయన సాధారణ వ్యక్తి, నీతివంతుడు, పుష్కలమైన దేశభక్తి ఉన్నవాడు. ఇవాళ మీరు ఆయనకు అండగా నిలవకుంటే, ఈ దేశంలో చదువుకున్న, నిజాయితీ కలిగిన వ్యక్తులెవరూ కూడా మునుముందు రాజకీయాల్లోకి రారు. కేజ్రీవాల్ విషయంలో మోదీ ఇలాగేనా వ్యవహరించేది?'' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
For Latest News and National News click here