Loksabha Elections: బీజేపీలో చేరిన శేఖర్ సుమన్, రాధిక
ABN , Publish Date - May 07 , 2024 | 02:28 PM
ప్రముఖ నటుడు శేఖర్ సుమన్, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రతినిధి రాధిక ఖేర బీజేపీలో చేరారు. మంగళవారం న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో వారిద్దరికి ఆ పార్టీ నేత వినోధ్ తాడ్వే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
న్యూఢిల్లీ, మే 07: ప్రముఖ నటుడు శేఖర్ సుమన్, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రతినిధి రాధిక ఖేర బీజేపీలో చేరారు. మంగళవారం న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో వారిద్దరికి ఆ పార్టీ నేత వినోధ్ తాడ్వే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రాధిక ఖేర మాట్లాడుతూ.. అయోధ్యలోని రామ మందిరాన్ని దర్శించిన అనంతరం కాంగ్రెస్ పార్టీలోని అగ్రనేతలు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.
BJP: బీజేపీకి తెలంగాణ టీడీపీ మద్దతు..
అలాగే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో న్యాయ యాత్ర చేస్తున్న సమయంలో.. పార్టీలోని కీలక నేత సుశీల్ ఆనంద్ సుఖ్ తనతో వ్యవహరించిన తీరును వివరించారు. ఈ అంశాన్ని పార్టీలోని సీనియర్ నేతలు సచిన్ పైలెట్, జైరాం రమేష్‌కు దృష్టికి తీసుకు వెళ్లి.. ఫిర్యాదు చేశానని తెలిపారు.
కానీ సుశీల్ ఆనంద్‌పై వాళ్లు ఎటుంవంటి చర్యలు చేపట్టలేదని ఆమె ఈ సందర్బంగా ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు సచిన్ పైలెట్‌కు పోన్ చేస్తే... తనతో మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదన్నారు. అయోధ్యలోని రామ మందిరాన్ని ఇటీవల రాధిక సందర్శించారు. అందుకు సంబంధించిన పోటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ.. తనను లక్ష్యంగా చేసుకొందని రాధిక ఆరోపిస్తున్నారు.
Delhi: కేజ్రీవాల్ అరెస్ట్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. బెయిలిస్తే అలా చేయొద్దని సూచన
ఇక శేఖర్ సుమన్ బీజేపీలో చేరడంతో.. ఆయన రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినట్లు అయింది. గతంలో అంటే.. 2009లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పాట్నా సాహెబ్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఆయన ప్రత్యర్థిగా బీజేపీ అభ్యర్థి, ప్రముఖ నటుడు శతృఘ్న సిన్హా బరిలో నిలిచారు. అయితే ఈ ఎన్నికల్లో వతృఘ్న సిన్హా విజయం సాధించారు. 2012లో శేఖర్ సుమన్.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నాటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
Read Latest National News and Telugu News