Share News

Srinagar: పాకిస్థాన్ గాజులు తొడుక్కోలేదు.. భారత్‌కు వార్నింగ్ ఇచ్చిన ఫరూక్ అబ్దుల్లా

ABN , Publish Date - May 06 , 2024 | 11:42 AM

పీఓకేను భారత్‌లో విలీనం చేస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) ఆదివారం స్పందించారు. పీఓకేను భారత్‌లో కలపాలని చూస్తే పాకిస్థాన్ గాజులు తొడుక్కుంటూ కూర్చోదని భారత్‌కు వార్నింగ్ ఇచ్చారు.

Srinagar: పాకిస్థాన్ గాజులు తొడుక్కోలేదు.. భారత్‌కు వార్నింగ్ ఇచ్చిన ఫరూక్ అబ్దుల్లా

శ్రీనగర్: పీఓకేను భారత్‌లో విలీనం చేస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) ఆదివారం స్పందించారు. పీఓకేను భారత్‌లో కలపాలని చూస్తే పాకిస్థాన్ గాజులు తొడుక్కుంటూ కూర్చోదని భారత్‌కు వార్నింగ్ ఇచ్చారు.

రక్షణ మంత్రి ఆదేశిస్తే భారత అధికారులు ముందుకు సాగుతారు.. కానీ పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయన్న విషయం మర్చిపోవద్దంటూ హెచ్చరించారు. ఆయన కామెంట్స్ ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భారత్‌లో భాగమని పార్లమెంట్‌ తీర్మానం చేసినట్లు విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ గుర్తు చేశారు. పీఓకే(PoK) గురించి ప్రజలు మరచిపోయేలా చేశారని, అయితే దాన్ని ఇప్పుడు తిరిగి తీసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు.


రాజ్‌నాథ్ సింగ్ ఏమన్నారంటే...

దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొని ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ (India) పై దుష్ప్రచారం చేసేవారికి తగిన గుణపాఠం చెబుతామని చైనా, పాకిస్థాన్‌లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏప్రిల్ 11న హెచ్చరించారు. ప్రధాని మోదీ(PM Modi) అధికారంలో ఉండగా భారత దేశం నుంచి ఒక్క అంగుళం భూమినీ ఆక్రమించలేరని అన్నారు.

ఉగ్రవాద భారాన్ని పాకిస్థాన్ భరించాల్సి వస్తుందని దాయాది దేశానికి వార్నింగ్ ఇచ్చారు. పీఓకే ఇండియాదేనని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని నియంత్రించలేమని పాకిస్థాన్ భావిస్తే ఉగ్రవాద నిర్మూలనకు భారతదేశం సహకరించడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. దేశం సురక్షితంగా ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

జమ్మూ కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370ని తొలగించినప్పటి నుంచి వేర్పాటువాదం, రాళ్ల దాడి వంటి ఘటనలు జరగలేదని చెప్పారు. కశ్మీర్ ప్రశాంతంగా ఉందని, తమనూ కశ్మీర్‌లో భాగం చేయాలని పీఓకే ప్రజలే కోరుతారని రాజ్ నాథ్ అన్నారు.

For Latest News and National News click here

Updated Date - May 06 , 2024 | 11:42 AM