Share News

Disaanayake: భారత్ సాయాన్ని మరువలేం: దిశనాయకే

ABN , Publish Date - Dec 16 , 2024 | 08:22 PM

భారతదేశ ప్రయోజనాలను హానికలిగించే ఎలాంటి కార్యక్రమాలకు తమ భూభాగంలో అనుమతించే ప్రసక్తే లేదని దిశనాయకే ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం శ్రీలంక ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించేందుకు కట్టుబడి ఉంటామని తమకు హామీ ఇచ్చినట్టు చెప్పారు.

Disaanayake: భారత్ సాయాన్ని మరువలేం: దిశనాయకే

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభం (Financial meltdown)తో తమ దేశం విలవిల్లాడుతున్నప్పుడు, రుణ పునర్వవస్థీకరణ (restructuring bilateral debt)కు భారత్ అందించిన ఆర్థిక సహకారాన్ని మరువలేమని శ్రీలంక (Srilanka) అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే (Aruna KUmara Dissanayake) అన్నారు. భారత్ అందిస్తున్న స్నేహహస్తానికి కృతజ్ఞతలు తెలిపారు. కొలంబోలో అధికారంలోకి వచ్చిన తర్వాత దిశనాయకే తొలిసారి భారత్‌లో పర్యటిస్తున్నారు. న్యూఢిల్లీలో సోమవారంనాడు జరిగిన ద్వైపాక్షిక సమావేశానంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి మీడియా సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడారు.

One Nation, One Election Bill: జమిలి ఎన్నికల బిల్లు లోక్‌సభకు..ఎప్పుడంటే


''రెండేళ్ల క్రితం అసాధారణమైన ఆర్థిక సంక్షోభాన్ని మేము చవిచూశాం. అలాంటి సంక్షుభిత పరిస్థితి నుంచి బయట పడేందుకు భారత్ ఎంతగానే చేయూత నిచ్చింది. ముఖ్యంగా అప్పుల నుంచి బయటపడేందుకు భారత్ ఎంతో సహకరించింది. భారతదేశ విదేశాంగ విధానంలో కొలంబోకు కీలకమైన స్థానం కల్పించింది'' అని దిశనాయకే ప్రశంసించారు. భారతదేశ ప్రయోజనాలను హానికలిగించే ఎలాంటి కార్యక్రమాలకు తమ భూభాగంలో అనుమతించే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం శ్రీలంక ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించేందుకు కట్టుబడి ఉంటామని తమకు హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఇరుదేశాల మధ్య సహకారం కొత్తపుంతలు తొక్కుతుందని తాను బలంగా నమ్ముతున్నామని, ఇండియాకు తామ బాసటగా నిలుస్తామని అన్నారు.


అభివృద్ధి ప్రాజెక్టులకు బాసటగా..

కొలంబో అభివృద్ధి ప్రాధాన్యాతల ఆధారంగానే ఆదేశంలో తమ బైలేటరల్ ప్రాజెక్టులు ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. క్రెడిట్ అండ్ గ్రాంట్ అసిస్టెన్స్‌‌గా శ్రీలంకకు ఇంతవరకూ 5 బిలియన్ డాలర్లు సాయం అందించామని చెప్పారు. మహో-అనారాధపుర రైల్వే స్టేషన్, కంకేసాంతురై పోర్ట్ వద్ద సిగ్నలింగ్ సిస్టమ్ పునర్వవస్థీకరణకు సహాయం చేయనున్నట్టు చెప్పారు. జాఫ్నా, ఈస్ట్రన్ ప్రావిన్స్‌ యూనివర్శిటీలోని 200 మంది విద్యార్థులకు నెలవారీ స్కాలర్‌షిప్‌లు ఇవ్వనున్నట్టు ప్రధాని ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో శ్రీలంక నుంచి 1500 మంది సివిల్ సర్వెంట్లకు శిక్షణ కూడా ఇస్తామన్నారు. శ్రీలంకలో గృహ, పునరుత్పత్తి ఇంధనం, మౌలిక వసతుల కల్పనతో పాటు వ్యవసాయం, పాడిపరిశ్రమ, మత్స్యపరిశ్రమ అభివృద్ధికి సహకారం అందిస్తామని ప్రకటించారు. శ్రీలంకంలో యునీక్ డిజిటల్ ఐడెంటిటీ ప్రాజెక్టులోనూ ఇండియా పార్టిసిపేషన్ ఉంటుందన్నారు. త్వరలోనే రక్షణ సహకార ఒప్పందాన్ని కూడా ఖరారు చేయనున్నట్టు తెలిపారు. కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ అనేది ప్రాంతీయ శాంతి, భద్రత, అభివృద్ధికి వేదక అవుతుందని తాము విశ్వసిస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం తీరప్రాంత భద్రత, కౌంటర్ టెర్రరిజం, సైబర్ సెక్యూరిటీ, స్మగ్లింగ్ నిరోధక చర్యలు, మానవనతా సహాయం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆదుకోవడం వంటి అంశాల్లో మరింత సహకారం అందిస్తామని మోదీ భరోసా ఇచ్చారు.


ఇవి కూడా చదవండి...

Priyanka Gandhi: ఇలా బ్యాగ్‌తో వచ్చి అలా వివాదంలోకి చిక్కి

Rahul Gandhi: సోనియా స్పందించ లేదు.. మీరైనా స్పందించండి.. రాహుల్‍కు లేఖ

Nirmala Sitharaman: కాంగ్రెస్ హయాంలో అంతా జైళ్లలోనే..

Updated Date - Dec 16 , 2024 | 08:25 PM