ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

K. Rammohan Naidu : రాష్ట్రంలో ఎయిర్‌పోర్టులను విస్తరిస్తాం

ABN, Publish Date - Aug 18 , 2024 | 05:25 AM

రాష్ట్రంలోని ఏడు విమానాశ్రయాలను 14కు పెంచే ఆలోచన ఉందని కేంద్ర విమానయాన మంత్రి కె. రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఈ ఉద్దేశంతోనే ఎయిర్‌పోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.

  • ఉన్న ఏడింటిని 14కు పెంచే యోచన

  • పౌర విమానయాన మంత్రి వెల్లడి

  • రామ్మోహన్‌తో సీఎం చంద్రబాబు భేటీ

  • ప్రధాన నగరాలకు ఎయిర్‌ కనెక్టివిటీ, హెలికాప్టర్‌, సీప్లేన్స్‌ సేవలు

  • వ్యవసాయం, వాణిజ్య రంగాల్లో డ్రోన్ల వినియోగంపై చర్చ

  • కేంద్ర మంత్రి రామ్మోహన్‌తో సీఎం చంద్రబాబు భేటీ

న్యూఢిల్లీ, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఏడు విమానాశ్రయాలను 14కు పెంచే ఆలోచన ఉందని కేంద్ర విమానయాన మంత్రి కె. రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఈ ఉద్దేశంతోనే ఎయిర్‌పోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల అభివృద్థి, ప్రస్తుతం వాడకంలో ఉన్న ఎయిర్‌పోర్టుల టెర్మినల్‌ సామర్థ్యం పెంచడంపై కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు చర్చించారు. శనివారం ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ భవన్‌లో వీరిద్దరూ భేటీ అయ్యారు.

రెండు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు ఎయిర్‌ కనెక్టివిటీ, హెలీకాప్టర్‌, సీప్లేన్స్‌ సేవలు, వ్యవసాయం, వాణిజ్య రంగాల్లో డ్రోన్ల వినియోగం వంటి అంశాలపై చర్చించారు. రాష్ట్రాభివృద్ధిలో విమాన రంగం ముఖ్య భూమిక పోషిస్తుందని, అందుకు కావలసిన పూర్తి సహకారం అందించడానికి సిద్థంగా ఉన్నామని కేంద్ర మంత్రి తెలిపారు.


కాగా, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడి సేవలను ఈ సమావేశంలో చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఎర్రన్నాయుడు టీడీపీ అభివృద్ధి కోసం అహర్నిశలూ కృషి చేశారని, అంచెలంచెలుగా ఎదిగి అగ్రస్థాయికి చేరుకున్నారని ప్రశంసించారు.


కాగా, తన తండ్రి చనిపోయిన తర్వాత చంద్రబాబే తండ్రిగా, గురువుగా, మార్గదర్శకుడిగా అన్ని విధాల అండగా నిలిచారని రామ్మోహన్‌ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్రమంత్రి మాట్లాడారు.

రాష్ట్రంలో విమానయాన రంగ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు చెప్పారు. శ్రీకాకుళం, కుప్పం, దగదర్తి, నాగార్జునసాగర్‌తో పాటు తుని, అన్నవరం, తాడేపల్లిగూడెం వంటి ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు కోసం చర్చించినట్లు వివరించారు. ఏపీని లాజిస్టిక్‌ హబ్‌గా మార్చాలన్నదే చంద్రబాబు విజన్‌ అని, ఇందులో విమానాశ్రయాల పాత్ర కీలకమని, 20, 30ఏళ్ల తర్వాత ఏర్పడబోయే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సీఎం ఇప్పుడే ఆలోచిస్తున్నారని కేంద్రమంత్రి తెలిపారు.

Updated Date - Aug 18 , 2024 | 05:26 AM

Advertising
Advertising
<