ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Karnataka Cabinet : ప్రతిపక్ష నాయకులపై పాత కేసుల విచారణ

ABN, Publish Date - Aug 23 , 2024 | 04:00 AM

బీజేపీ, జేడీఎస్‌ నాయకులపై నమోదైన నాలుగు పాత కేసులను తెరపైకి తేవాలని కర్ణాటక మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది.

  • కర్ణాటక మంత్రివర్గం నిర్ణయం

బెంగళూరు, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): బీజేపీ, జేడీఎస్‌ నాయకులపై నమోదైన నాలుగు పాత కేసులను తెరపైకి తేవాలని కర్ణాటక మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న కేంద్రమంత్రి కుమారస్వామి, మాజీ మంత్రులు శశికళ జొల్లె, మురుగేశ్‌ నిరాణి, గాలి జనార్దనరెడ్డి కేసుల ప్రాసిక్యూషన్‌కు అనుమతులు కోరాలని తీర్మానించింది.

ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ భేటీలో నాలుగు పాత కేసుల్లో ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌కు ప్రతిపాదిస్తూ తీర్మానం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 163 ప్రకారం మంత్రివర్గం అధికారాన్ని వినియోగించుకుని ఈ తీర్మానం చేశారు.

క్యాబినెట్‌ భేటీ తర్వాత శాసనసభ, న్యాయవ్యవహారాలశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న నలుగురు నాయకుల కేసుల ప్రాసిక్యూషన్‌కు అనుమతులివ్వాలని కోరుతూ తీర్మానించామన్నారు.

కుమారస్వామి వివాదంలో మరిన్ని వివరాలు కావాలని లోకాయుక్త సిట్‌ను గవర్నర్‌ కోరిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రాసిక్యూషన్‌కు త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌కు మంత్రివర్గం సిఫారసు చేసిందని తెలిపారు. ఇందులో ద్వేషపూరిత రాజకీయంలేదని స్పష్టం చేశారు.

Updated Date - Aug 23 , 2024 | 04:00 AM

Advertising
Advertising
<