ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congress: మోదీ నినాదాలు చేసేవారిని చెప్పుతో కొట్టండి.. మంత్రి సంచలన కామెంట్స్..

ABN, Publish Date - Mar 26 , 2024 | 07:36 AM

కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడిగి చేసిన కామెంట్స్ దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మోదీ మోదీ అని నినాదాలు చేసే యువతను చెప్పుతో కొట్టాలని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి.

కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడిగి చేసిన కామెంట్స్ దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మోదీ మోదీ అని నినాదాలు చేసే యువతను చెప్పుతో కొట్టాలని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ( BJP ) నేతృత్వంలోని ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని మంత్రి విమర్శించారు. కొప్పల్ జిల్లా కరటగిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి ఈ కామెంట్స్ చేశారు. అభివృద్ధిని బీజేపీ విస్మరించిందన్న ఆయన వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు సిగ్గుపడాలని మండిపడ్డారు.

"సిగ్గుపడాలి. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారు. ఒక్క అభివృద్ధి పని చేయలేని అసమర్థులు మీరు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా?.. ఉద్యోగాలు అడిగితే పరోఠాలు అమ్ముకోండి అని చెప్తున్నారు. ఇదేనా అభివృద్ధి."

- శివరాజ్, మంత్రి

Tamil Nadu: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. తమిళనాడు మంత్రిపై కేసు నమోదు


మంత్రి తంగడిగి వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ లీడర్ రవి ఫైర్ అయ్యారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోతోందని, ఆ విషయాన్ని జీర్ణించుకోలేని హస్తం పార్టీ ఇలాంటి మాటలు మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానిగా రాహుల్ గాంధీని తిరస్కరించిన యువ భారత్.. మళ్లీ నరేంద్ర మోదీనే ప్రధాని కావాలని కోరుకుంటోందని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 26 , 2024 | 07:36 AM

Advertising
Advertising