Maharashtra: నిరుద్యోగులకు నెలకు రూ. 6 నుంచి 10 వేలు
ABN, Publish Date - Jul 18 , 2024 | 05:12 AM
మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ‘లాడ్లా భాయ్ యోజన’ అనే పేరుతో ప్రకటించిన ఈ స్కీమ్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ శిక్షణతో పాటు స్టైపెండ్‌ను అందించనుంది.
కొత్త పథకాన్ని ప్రారంభించిన మహారాష్ట్ర సర్కారు
పుణే, జూలై 17: మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ‘లాడ్లా భాయ్ యోజన’ అనే పేరుతో ప్రకటించిన ఈ స్కీమ్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ శిక్షణతో పాటు స్టైపెండ్‌ను అందించనుంది. విద్యార్హతలను బట్టి ప్రతి నెలా స్టైపెండ్‌ను జమ చేయనున్నారు. పండరిపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఈ పథకాన్ని ప్రకటించారు.
18-35 ఏళ్ల వయసు గల మహారాష్ట్రకు చెందిన వారు అర్హులు కాగా, 12 వ తరగతి, డిగ్రీ పూర్తిచేసినవారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణను అందించనున్నారు. ఆరు నెలల ఇంటర్న్‌షిప్ కాలంలో అర్హులైన వారికి భృతిని అందజేస్తారు. 12వ తరగతి పాసైన వారికి నెలకు రూ. 6 వేలు, డిప్లొమా చేసినవారికి నెలకి రూ. 8 వేలు, డిగ్రీ/పీజీ పూర్తిచేసినవారికి రూ. 10 వేల చొప్పున స్టైపెండ్‌ను చెల్లించనున్నారు.
Updated Date - Jul 18 , 2024 | 05:12 AM