TG Govt: మహిళలకు ప్రభుత్వం కీలక ప్రకటన
ABN, Publish Date - Aug 03 , 2024 | 07:20 PM
తెలంగాణలోని మహిళలకు రూ.20 వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలిపారు. ముదిగొండ మండలం కమలాపురంలో మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు.
ఖమ్మం జిల్లా: తెలంగాణలోని మహిళలకు రూ.20 వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలిపారు. ముదిగొండ మండలం కమలాపురంలో మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో భట్టి మాట్లాడుతూ... మధిర నియోజకవర్గంలో కొద్ది రోజుల్లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులకు శంకుస్థాపన చేయబోతున్నామని తెలిపారు. అంగన్ వాడీలో 3 వ తరగతి వరకు ఏర్పాటు చేసి నాల్గోతరగతికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలుకు పంపించే ఏర్పాటుకు నాంది పలికామని అన్నారు.
అలాంటి పాఠశాలలు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ డైరీ చిరకాల వాంఛ ఇదని వివరించారు. నియోజకవర్గంలోని మహిళలను పాడి పరిశ్రమలో వాటాదారులుగా చేసి వారిని పారిశ్రామిక వేత్తలుగా చేయడానికి 2014కు ముందే ఇందిరమ్మ డైరీని ప్రవేశ పెట్టామని వెల్లడించారు. నియోజకవర్గంలోని డ్వాక్రా మహిళలకు గేదెలు ఇచ్చి వారిని పరిశ్రమలో వాటా దారులుగా చేస్తామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఆర్థికమంత్రిగా బడ్జెట్ ప్రవేశ పెట్టామని తెలిపారు. నియోజకవర్గంలో మిగిలిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభిస్తామని మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
Updated Date - Aug 03 , 2024 | 07:23 PM