Amit Shah : ‘వేసవి వస్తే చాలు.. విదేశాలకు జంప్’
ABN, Publish Date - Apr 02 , 2024 | 06:35 PM
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 లోక్‌సభ స్థానలకుపైగా గెలుచుకుంటుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు
బెంగళూరు, ఏప్రిల్2: ఈ ఎన్నికల్లో (Loksabha Elections 2024) ఎన్డీఏ కూటమి 400 లోక్‌సభ స్థానలకుపైగా గెలుచుకుంటుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amith Shah) విశ్వాసం వ్యక్తం చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్టీఏ కూటమి ఉంటే.. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని ఇండియా కుటమిలో మాత్రం, రాజవంశీయులు, అవినీతిపరులు ఉన్నారన్నారు. ప్రధాని మోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా భారత్ కోసం పని చేసుకు పోతుంటే... కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం వేసవి వచ్చిందంటే చాలు.. విదేశాలకు వెళ్లిపోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికే కాదు.. ప్రధాని మోదీకి, రాహుల్ గాంధీలను సైతం ఏ మాత్రం సరిపోల్చలేమని ఆయన స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో పర్యటించానని.. అయితే 60 శాతం మంది ప్రజలు మోదీ.. మోదీ అంటు నినదిస్తున్నారని అమిత్ షా చెప్పారు. 23 ఏళ్ల నుంచి నరేంద్ర మోదీ.. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా పని చేస్తున్నారని.. ఆయన 25 పైసల అవినీతి చేశారని ప్రతిపక్ష పార్టీలు నేటికి ఆరోపణ చేయలేదని.. అంటే అది మోదీ పారదర్శక పాలనకు నిదర్శమని అమిత్ షా స్పష్టం చేశారు.
గతంలో సోనియా సారథ్యంలోని యూపీయే పాలనలో 10 ఏళ్ల మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రూ. 12 లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. బొగ్గు గనులు, కామన్వెల్త్ క్రీడలు, 2 జీ స్పెక్ట్రమ్, ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్‌సెల్, ల్యాండ్ ఫర్ జాబ్, జమ్ము కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్.. ఇలా చెప్పుకొంటే పోతే.. యూపీఏ పాలన అవినీతిమయం అని ఆయన పేర్కొన్నారు. ఇక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం అవినీతిలో ఇరుక్కున్నారని చెప్పారు. అయితే కర్ణాటక ప్రజలు అవినీతి చేస్తే ఒప్పుకోరని అమిత్ షా ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు బీజేపీకి 17 స్థానాలు కట్టబెట్టారని.. అలాగే 2019 ఎన్నికల్లో 25 సీట్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారని.. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయనున్నారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.
మరిన్నీ జాతీయ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Lok Sabha Elections 2024: పలు రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకులు: సీఈసీ
IMD: కాలం మారింది బాస్.. దక్షిణాన ఎండలు.. తూర్పున వానలు..
Updated Date - Apr 02 , 2024 | 08:04 PM