ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mumbai : యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీపై కేసు నమోదు

ABN, Publish Date - Jul 14 , 2024 | 03:53 AM

ప్రముఖ యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీపై మహారాష్ట్ర సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ధ్రువ్‌ రాఠీ పేరిట ఉన్న ఓ పేరడీ ‘ఎక్స్‌’ ఖాతా నుంచి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు కుమార్తెకు సంబంధించి తప్పుడు సమాచారం పోస్టు చేసిన నేపథ్యంలో..

ముంబై, జూలై 13: ప్రముఖ యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీపై మహారాష్ట్ర సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ధ్రువ్‌ రాఠీ పేరిట ఉన్న ఓ పేరడీ ‘ఎక్స్‌’ ఖాతా నుంచి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు కుమార్తెకు సంబంధించి తప్పుడు సమాచారం పోస్టు చేసిన నేపథ్యంలో.. బిర్లా బంధువుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశామని శనివారం పోలీసులు వెల్లడించారు.

‘లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కుమార్తె అంజలి యూపీఎస్సీ పరీక్షకు హాజరవ్వకుండానే ఉత్తీర్ణురాలయ్యారు’ అంటూ తప్పుడు సమాచారం పోస్టు చేసినట్లు వివరించారు. అయితే ఆ ఖాతా బయోలో ‘ఇది ఫ్యాన్‌, పేరడీ ఖాతాఽ’ అని ఉంది. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా.. దీన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే అదే ఖాతా నుంచి.. ‘సైబర్‌ క్రైం పోలీసుల సూచనల మేరకు అంజలిపై చేసిన పోస్టును తొలగించాను. వాస్తవం తెలుసుకోకుండా వేరొకరి ట్వీట్‌ను కాపీ చేసి పోస్టు చేసినందుకు క్షమాపణలు’ అని తాజా పోస్టులో పేర్కొన్నారు.

Updated Date - Jul 14 , 2024 | 03:53 AM

Advertising
Advertising
<