ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nirmala Sitha Raman: 23న కేంద్ర బడ్జెట్‌

ABN, Publish Date - Jul 07 , 2024 | 02:38 AM

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సమావేశాల రెండో రోజు......

  • ఈనెల 22 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్‌

న్యూఢిల్లీ, జూలై 6(ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సమావేశాల రెండో రోజు, జూలై 23న 2024-25 ఏడాదికి గాను కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు పార్లమెంట్‌ ఉభయసభల షెడ్యూల్‌ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు శనివారం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా ఫిబ్రవరిలో బడ్జెట్‌ను ప్రకటిస్తుంది.

అయితే, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు పూర్తి కావడంతో ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో వరుసగా ఏడుసార్లు బడ్జెట్‌ సమర్పించిన ఘనతను మంత్రి నిర్మలా సీతారామన్‌ అందుకోనున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రెండో మహిళగా ఇప్పటికే రికార్డులకెక్కిన నిర్మలా ఇప్పటిదాకా ఆరు బడ్జెట్లు సమర్పించారు. ఇప్పటివరకు మొరార్జీ దేశాయ్‌ వరుసగా ఆరుసార్లు బడ్జెట్‌ సమర్పించారు.

Updated Date - Jul 07 , 2024 | 07:25 AM

Advertising
Advertising
<