ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Jammu And Kashmir: హవ్వా.. కశ్మీర్ ఎన్నికలను సుప్రీంకోర్టు చెబుతుందా..? ఈసీ తీరుపై ఒమర్ అబ్దుల్లా నిప్పులు

ABN, Publish Date - Feb 25 , 2024 | 11:25 AM

కేంద్ర ఎన్నికల సంఘం తీరును నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తప్పు పట్టారు. జమ్ము కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని సుప్రీంకోర్టు ప్రకటించడం ఏంటని మండిపడ్డారు. ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమయ్యిందని ధ్వజమెత్తారు.

శ్రీనగర్: కేంద్ర ఎన్నికల సంఘం (EC) తీరును నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) తప్పు పట్టారు. జమ్ము కశ్మీర్‌లో (Jammu And Kashmir) ఎన్నికలు నిర్వహించే అంశాన్ని సుప్రీంకోర్టు ప్రకటించడం ఏంటని మండిపడ్డారు. దీంతో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమయ్యిందని ధ్వజమెత్తారు. ఆదివారం నాడు ఒమర్ అబ్దుల్లా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్, లడాఖ్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

సెప్టెంబర్ 30 డెడ్ లైన్

జమ్ము కశ్మీర్, లడాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ల పాలనలో ఆ రెండు ప్రాంతాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రాలుగా ఏర్పాటు చేసి, ఎన్నికలు నిర్వహించాలని ఒమర్ అబ్దుల్లా సహా పలువురు ప్రాంతీయ నేతలు కోరుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని కొందరు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. 2024 సెప్టెంబర్ 30వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఆ గడువుపై కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుందని ఒమర్ అబ్దులా ప్రశ్నించారు.

ఎక్కువైన కశ్మీర్ పండిట్ల మరణాలు

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో పరిస్థితి మరింత దిగజారిందని ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. గతంలో జమ్ము, రాజౌరి, పూంచ్‌‌లో ఉగ్రవాద సమస్య లేదని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఉగ్రవాదం పేట్రెగిపోతుందని వివరించారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కశ్మీర్ పండిట్ల మరణాలు ఎక్కువ అయ్యాయని ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 25 , 2024 | 11:25 AM

Advertising
Advertising