Share News

Shehbaz Sharif congrats Modi: 'హ్యాట్రిక్' మోదీకి అభినందనలు తెలిపిన పాక్ ప్రధాని

ABN , Publish Date - Jun 10 , 2024 | 04:23 PM

భారతదేశ ప్రధానమంత్రిగా మూడోసారి చారిత్రక విజయం సాధించి భాద్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీకి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోమవారంనాడు అభినందనలు తెలిపారు. ''ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తున్న మీకు అభినందనలు'' అని సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'లో షెహబాజ్ ట్వీట్ చేశారు.

Shehbaz Sharif congrats Modi:  'హ్యాట్రిక్' మోదీకి అభినందనలు తెలిపిన పాక్ ప్రధాని

ఇస్లామాబాద్: భారతదేశ ప్రధానమంత్రిగా మూడోసారి చారిత్రక విజయం సాధించి భాద్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ (Narendra Modi)కి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) సోమవారంనాడు అభినందనలు తెలిపారు. ''ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తున్న మీకు అభినందనలు'' అని సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'లో షెహబాజ్ ట్వీట్ చేశారు. చైనాలో ఐదు రోజుల పర్యటన ముగించుకున్న మరుసటి రోజే షెహబాజ్ ఈ ట్వీట్ చేశారు. షెహబాజ్ తన పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ను కలుసుకుని, ఇస్లామాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిందిగా అభ్యర్థించారు.


కాగా, ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే 293 సీట్లు సాధించిన మెజారిటీ మార్క్ 272ను దాటింది. ఇందుకు అనుగుణంగా నరేంద్ర మోదీ ఆదివారంనాడు మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు.

PM Modi: బాధ్యతలు స్వీకరించిన మోదీ.. రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రధాని..


పాక్‌ను ఆహ్వానించని ఇండియా

రాష్ట్రపతి భవన్‌లో అత్యంత కోలాహలంగా జరిగిన నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారానికి పొరుగు దేశాలైన మాల్దీవులు, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, మారిషస్, నేపాల్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇస్లామాబాద్‌కు మాత్రం ఆహ్వానం పంపలేదు. ఎన్డీయే గెలుపు అనంతరం పాక్ నుంచి మోదీకి ఎలాంటి అభినందలు రాలేదు. దీనిపై విదేశీ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జెహ్రా బలోజ్‌ గతవారంలో స్పందిస్తూ, కొత్త ప్రభుత్వం అధికారికంగా ప్రమాణస్వీకారం చేయనందున భారత ప్రధానిని అభినందించడం ప్రీ-మెచ్యూర్ అవుతుందని వ్యాఖ్యానించారు. ఇండియాతో సహా ఇరుగుపొరుగు దేశాలతో ఇస్లామాబాద్ సత్సంబంధాలు కోరుకుంటున్నట్టు ఆమె తెలిపారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం కావాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. 2014లో బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోదీ ప్రధానిగా స్వీకారం చేసినప్పుడు అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సహా హాజరయ్యారు. 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను భారత ప్రభుత్వం రద్దు చేయడంతో ఆ నిర్ణయాన్ని అంతర్జాతీయ వేదకలపై ప్రస్తావించేందుకు పాక్ ప్రయత్నాలు చేసింది. అయితే, పాక్ ప్రయత్నం అంతర్జాతీయ దేశాల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఇరుదేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సస్పెండ్ చేశాయి.

Read More National News and Latest Telugu News

Updated Date - Jun 10 , 2024 | 04:23 PM