ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: నా దేవుడివి నువ్వే.. కవల పిల్లలను చూడకుండానే ప్రధాని మోదీ వద్దకు

ABN, Publish Date - Mar 05 , 2024 | 10:26 AM

తమిళనాడుకు చెందిన బీజేపీ కార్యకర్త అశ్వంత్‌కు కవల పిల్లలు జన్మించారు. వారిని చూడకుండా ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు చెన్నై ఎయిర్ పోర్టుకు వెళ్లారు. ఆ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేసి ఎమోషనల్ అయ్యారు. అశ్వంత్, అతని కుటుంబానికి ప్రధాని మోదీ ఆశీస్సులు అందజేశారు.

చెన్నై: తండ్రి అవడం జీవితంలో మధుర ఘట్టం. ఎన్ని పనులున్నా సరే.. వదులుకొని భార్య డెలివరీ సమయంలో ఆస్పత్రి వద్ద ఉంటారు. డెలివరీ కాగానే పుట్టిన పాప/ బాబును చూసి ముచ్చట పడుతుంటారు. ఇక కవల పిల్లలు (Twins) జన్మిస్తే ఆ థ్రిల్లే వేరు. భారతీయ జనతా పార్టీ (BJP) కార్యకర్త మాత్రం అందుకు విరుద్దం. తనకు ట్విన్స్ (Twins) పుట్టారని తెలిసినా.. ఆస్పత్రికి వెళ్లకుండా ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు.

పిల్లలను చూడకుండా

ప్రధాని మోదీ (PM Modi) సోమవారం తమిళనాడు వచ్చారు. వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం వచ్చారు. ప్రధాని మోదీకి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. వారిలో అశ్వంత్ పిజాయ్ జి ఒకరు. ఇతను ఓ సాధారణ కార్యకర్త, కానీ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ చెన్నై రావడానికి ముందు అతని భార్య కవల పిల్లలను జన్మనిచ్చింది. అయినప్పటికీ అతను ఆస్పత్రికి వెళ్లలేదు. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు చెన్నై ఎయిర్ పోర్టుకు వచ్చారు. తనకు కవల పిల్లలు జన్మించారని, భార్య ఆస్పత్రిలో ఉందని.. మీకు స్వాగతం పలికేందుకు ఇక్కడిని వచ్చానని మోదీతో అశ్వంత్ చెప్పారు. ఆ మాటలు విన్న ప్రధాని మోదీ ఎమోషనల్ అయ్యారు. తనతో అశ్వంత్ దిగిన ఫొటో సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేశారు.

అశ్వంత్ యువర్ గ్రేట్

‘భారతీయ జనతా పార్టీకి (BJP) అంకితభావంతో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. అశ్వంత్‌తో అది రుజువు అయ్యింది. ఈ రోజు అశ్వంత్‌ తనను కలువడం సంతోషంగా ఉంది. అతనికి కవలలు జన్మించారని తనతో చెప్పారు. కవలలను చూడకుండా తన వద్దకు అశ్వంత్ వచ్చారు. తన వద్దకు రాకుంటే బాగుండేదని అశ్వంత్‌తో అన్నాను. అతనికి, కుటుంబానికి ఆశీస్సులు అందజేశాను. అప్పుడే జన్మించిన పిల్లలను చూడకుండా తన వద్దకు వచ్చి.. తన మీద ప్రేమ, అప్యాయత, గౌరవాన్ని అశ్వంత్ చాటారు. అతని వాత్యల్యానికి ధన్యుడిని అని’ ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2024 | 10:26 AM

Advertising
Advertising