ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత.. తొలిసారి కశ్మీర్‌కు ప్రధాని మోదీ

ABN, Publish Date - Mar 07 , 2024 | 09:16 AM

ప్రధాని నరేంద్ర మోదీ బిజీగా ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో క్షణం తీరకలేకుండా గడుపుతున్నారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో ప్రధాని మోదీ ఈ రోజు పర్యటిస్తారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి కశ్మీర్ వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీనగర్‌లో రూ.6400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.

శ్రీనగర్: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) బిజీగా ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో క్షణం తీరకలేకుండా గడుపుతున్నారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో ప్రధాని మోదీ (PM Modi) ఈ రోజు పర్యటిస్తారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ప్రధాని మోదీ (PM Modi) తొలిసారి కశ్మీర్ వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీనగర్‌లో రూ.6400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. శ్రీనగర్‌లో గల స్టేడియంలో వికసిత్ భారత్ వికసిత్ కశ్మీర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. స్వదేశ్ దర్శన్, ప్రసాద్ ( కింద రూ.1400 కోట్లతో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు.

జమ్ము కశ్మీర్‌లో ఉద్యోగాలు పొందిన వెయ్యి మందికి అపాయింట్ మెంట్ లెటర్లను ప్రధాని మోదీ అందజేస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందుతున్న పలువురితో ప్రధాని మోదీ సమావేశం అవుతారు. వారిలో మహిళలు, రైతులు, ఉంటారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మోదీ పాల్గొనే సభ వేదిక 2 కిలోమీటర్ల పరిధిలో పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. జీలం నది, దాల్ సరస్సులో మెరైన్ కమాండోలను మొహరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 07 , 2024 | 09:18 AM

Advertising
Advertising