PM Modi: ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నాం: ప్రధాని మోదీ
ABN , Publish Date - Apr 11 , 2024 | 05:46 PM
విపక్షాలపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశంలో బలహీన, అస్థిర ప్రభుత్వాలు ఉంటే శత్రువులకు అవకాశంగా మారుతోందని గుర్తుచేశారు. ఉగ్రవాద సామ్రాజ్యం బలపడుతోందని వివరించారు. అలాంటి పరిస్థితి ఉండొద్దని పేర్కొన్నారు. గత యూపీఏ హయాంలో నెలకొన్న పరిస్థితులను గురించి మాట్లాడారు. తమ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పేకలిస్తోందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ గురువారం నాడు రిషికేష్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
రిషికేష్: విపక్షాలపై ప్రధాని మోదీ (PM Modi) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశంలో బలహీన, అస్థిర ప్రభుత్వాలు ఉంటే శత్రువులకు అవకాశంగా మారుతోందని గుర్తుచేశారు. ఉగ్రవాద సామ్రాజ్యం బలపడుతోందని వివరించారు. అలాంటి పరిస్థితి ఉండొద్దని పేర్కొన్నారు. గత యూపీఏ హయాంలో నెలకొన్న పరిస్థితులను గురించి మాట్లాడారు. తమ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పేకలిస్తోందని స్పష్టం చేశారు. ఇంట్లో ఉన్న ఉగ్రవాదులను కూడా భద్రతా దళాలు హతమార్చాయని వివరించారు. ప్రధాని మోదీ గురువారం నాడు రిషికేష్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
POK: పీఓకే మాదే.. ఒక్క అంగుళమూ కదలనివ్వం.. చైనాకు రాజ్ నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్..
దశాబ్దాల తర్వాత
ఆరు దశాబ్దాల తర్వాత జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేశామని ప్రధాని మోదీ వివరించారు. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేశామని పేర్కొన్నారు. లోక్ సభ స్థానాలు, అసెంబ్లీ స్థానాల్లో మహిళ నేతలకు రిజర్వేషన్ కల్పించామని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగితే వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమల్లోకి వచ్చేది కాదని వివరించారు. మాజీ సైనిక ఉద్యోగులకు రూ.500 కోట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. తమ ప్రభుత్వం ఇప్పటికే రూ.1 లక్ష కోట్లను సైనికుల ఖాతాల్లో జమ చేసిందని మోదీ వివరింంచారు. ఉత్తరాఖండ్‌కు చెందిన 3500 మంది మాజీ సైనిక ఉద్యోగ కుటుంబాలు ఉన్నాయని వివరించారు.
LokSabha Elections: దక్షిణాదిలో పాగా వేస్తాం
ఆధునిక రైఫిళ్లు
సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అందజేశామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అత్యాధునికి రైఫిళ్లను సమకూర్చామని ప్రకటించారు. ఫైటర్ ఫ్లైట్స్ అందజేశామని ప్రధాని మోదీ వెల్లడించారు. తమ హయాంలో జాతీయ రహదారుల అభివృద్ధి చేశామని, టన్నెల్స్ మెరుగుపరిచామని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం