ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections: బీజేపీ-పీఎంకే మధ్య తేలిన లెక్క.. ఎన్ని సీట్లు అంటే..?

ABN, Publish Date - Mar 19 , 2024 | 03:49 PM

పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ తైలపురంలో గల నివాసానికి మంగళవారం ఉదయం తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై వచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే సీట్ల గురించి చర్చ జరిగింది. లోక్ సభ ఎన్నికల్లో 10 సీట్లను పీఎంకే కేటాయించామని అన్నమలై ప్రకటించారు.

చెన్నై: లోక్ సభ ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య పొత్తులు పొడుస్తున్నాయ్. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలదే హవా. ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు జాతీయ పార్టీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. తమిళనాడులో డీఎంకే (DMK), అన్నాడీఎంకే (AIADMK) పార్టీలదే హవా ఉంటుంది. అన్నాడీఎంకే నేత జయలలిత మృతి తర్వాత ఆ పార్టీ ప్రభ తగ్గింది. డీఎంకే (DMK) పార్టీ హవా నడుస్తోంది. ఈ క్రమంలో తమిళనాడులో (Tamilnadu) సత్తా చాటాలని భారతీయ జనతా పార్టీ (BJP) అనుకుంటోంది. ప్రాంతీయ పార్టీ పట్టాలి మక్కల్ కట్చి (PMK) పొత్తు పెట్టుకుంది.

పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ తైలపురంలో గల నివాసానికి మంగళవారం ఉదయం తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై వచ్చారు. లోక్ సభ సీట్ల గురించి ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగింది. లోక్ సభ ఎన్నికల్లో 10 సీట్లను పీఎంకే కేటాయించామని అన్నామలై ప్రకటించారు. ప్రధాని మోదీ మాదిరిగా సమాజానికి మంచి చేయాలనే తపన రాందాస్‌కు ఉందని ప్రశంసించారు. దక్షిణ తమిళనాడులో వన్నియార్ కులం ప్రభావం ఉంటుంది. పీఎంకేకు ఆ కమ్యునిటీ ఓటు బ్యాంక్ ఉంది. ఎన్డీఏ కూటమిలో పీఎంకే గత పదేళ్ల నుంచి భాగస్వామిగా ఉంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 19 , 2024 | 03:49 PM

Advertising
Advertising