West Bengal: దీదీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసు.. బీజేపీ నేతకు ఈసీ షోకాజ్ నోటీసులు
ABN, Publish Date - May 17 , 2024 | 05:28 PM
పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీకి(Mamata Banerjee) వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను తమ్లూక్ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయ్‌కి(Abhijit Gangopadhyay) ఎన్నికల సంఘం(EC) శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీచేసింది.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీకి(Mamata Banerjee) వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను తమ్లూక్ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయ్‌కి(Abhijit Gangopadhyay) ఎన్నికల సంఘం(EC) శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీచేసింది. బెంగాల్‌లోని ఈస్ట్ మిడ్నాపూర్ ఎన్నికల ప్రచారంలో అభిజిత్ మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంతకు అమ్ముడు పోతున్నారు?’ అని ప్రశ్నించారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళలను అగౌవరపరిచేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ టీఎంసీ మండి పడుతోంది. దీనిపై టీఎంసీ నేత శాంతాను సేన్ స్పందించారు. ఆ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అభిజిత్ గంగోపాధ్యాయ్ వ్యాఖ్యలపై ఈసీ ప్రాథమిక విచారణ పూర్తిచేసి వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా ఉన్న మాజీ న్యాయమూర్తి మహిళా ముఖ్యమంత్రిని కించపరిచేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని శాంతాను సేన్ విమర్శించారు. బీజేపీ పాలనలో మహిళలను ఈ విధంగా అవమానిస్తారా? అంటూ మండిపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలు అభిజిత్ గంగోపాధ్యాయ చేయలేదని ఇది ఫేక్ వీడియో అంటూ బీజేపీ కొట్టిపారేస్తోంది.
ఫేక్ వీడియోలను విడుదల చేసి బీజేపీని బద్నాం చేయడానికి టీఎంసీ ప్రయత్నిస్తోందంటూ ఆ పార్టీ రివర్స్ దాడికి దిగింది. ఇలాంటి ప్రయత్నాలేవీ ఎన్నికల్లో సత్ఫలితాలను ఇవ్వవంటూ బీజేపీ అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య తెలిపారు.
For More National News and Telugu News..
Updated Date - May 17 , 2024 | 05:32 PM