ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Priyanka Gandhi Journey: ప్రధాన కార్యదర్శి నుంచి పార్లమెంట్ దాకా.. ప్రియాంకా ప్రయాణం ఇదే..

ABN, Publish Date - Nov 23 , 2024 | 03:03 PM

కేరళ రాష్ట్రం వయనాడ్ లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికల ఫలితాల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఏకంగా నాలుగు లక్షల ఓట్ల ఆధిక్యంతో ఆమె ముందంజలో ఉన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: కేరళ రాష్ట్రం వయనాడ్ లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికల ఫలితాల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఏకంగా నాలుగు లక్షల ఓట్ల ఆధిక్యంతో ఆమె ముందంజలో ఉన్నారు. కాగా, బుధవారం రోజున వయనాడ్, నాందేడ్ లోక్ సభ స్థానాలు, 13 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇవాళ (శనివారం) రోజున ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అయితే ఇప్పటివరకూ ప్రియాంక గాంధీ ఏరోజూ ప్రత్యేక ఎన్నికల్లో పాల్గొనలేదు. ఆమె ఎప్పుడూ పార్టీలో సభ్యురాలిగానే ఉంటూ తల్లి సోనియా గాంధీతో కలిసి సోదరుడు రాహుల్ గాంధీకి వెన్నుదన్నుగా నిలిచారు. అలాగే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అత్యంత హుందాగా ఇప్పటివరకూ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు.


అయితే ఈ ఏడాది మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వయనాడ్(కేరళ), అమేథీ(ఉత్తర్ ప్రదేశ్) రెండు స్థానాల నుంచి లోక్ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేశారు. ఆయన 3 లక్షలకు పైగా మెజార్టీతో వయనాడ్‌లో భారీ విజయం సాధించగా.. అమేథీలోనూ గెలుపొందారు. దీంతో ఆయన ఎక్కడ్నుంచి ప్రాతినిధ్యం వహిస్తారనే ఉత్కంఠ నెలకొంది. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం సైతం మల్లగుల్లాలు పడింది. చివరికి ఆయన అమేథీ నుంచి లోక్ సభకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే వయనాడ్ స్థానంలో ఉపఎన్నిక ఏర్పడుతుంది కాబట్టి ఆ స్థానం నుంచి ఎవర్ని పోటీ చేయించాలనే ప్రశ్న ఉత్పన్నమైంది.


అయితే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సైతం ఆలోచనలో పడ్డారు. వయనాడ్ లోక్ సభ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. దాన్ని నిలబెట్టుకునేందుకు ఆ స్థానం నుంచి రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీని పోటీకి దింపాలని అంతా నిశ్చయించారు. అయితే అప్పటివరకూ ఆమె ఎప్పుడూ ప్రత్యేక రాజకీయాల్లో పాల్గొనలేదు. ఈ ప్రతిపాదనను ఒప్పుకునేందుకు తొలుత ఆమె తటపటాయించినా.. తర్వాత తల్లి, సోదరుడు అభీష్టం మేరకు ఒప్పుకోక తప్పలేదు. దీంతో తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో ఆమె పోటీ చేసి విజయం వైపు పరుగులు పెడుతున్నారు.


రికార్డు బద్దలు..

వ‌య‌నాడ్ లోక్ సభ ఉపఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ప్రియాంకా గాంధీ వాద్రా సరికొత్త రికార్డు నమోదు చేశారు. గత ఎన్నికల్లో ఆ స్థానం నుంచి రాహుల్ గాంధీ 3.65 లక్షల మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. ఆ నియోజకవర్గంలో అప్పటికి అదే అత్యధిక మెజార్టీ. అయితే తాజా ఎన్నికల్లో ఆ రికార్డును ప్రియాంకా గాంధీ బద్దలు కొట్టారు. తన సోదరుడు నెలకొల్పిన భారీ మెజార్టీ రికార్డును ఆమె తన సొంతం చేసుకున్నారు. వయనాడ్ నియోజకవర్గంలో ప్రియాంకా గాంధీ 4,03,966 ఓట్ల మెజార్టీతో దూసుకెళ్తున్నారు. ఆమెకు ఈ ఎన్నికల్లో మెుత్తం 5.78 లక్షల ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో క‌మ్యూనిస్టు పార్టీ అభ్యర్థి సత్యన్ మోక‌రి ఉన్నారు. అలాగే బీజేపీ అభ్యర్థి న‌వ్య హ‌రిదాస్ 10 వేల ఓట్లతో మాడో స్థానానికి పరిమితమయ్యారు. దీంతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రియాంకా గాంధీ.. లోక్ సభ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్‌కు తొలిసారి వెళ్లనున్నారు.

Updated Date - Nov 23 , 2024 | 03:15 PM