ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rahul Gandhi : అయోధ్యలో బీజేపీతో పాటు రామాలయ ఉద్యమాన్నీ ఓడించాం

ABN, Publish Date - Jul 07 , 2024 | 03:18 AM

అయోధ్యలో బీజేపీ అభ్యర్థిని ఓడించడం ద్వారా.. ఆడ్వాణీ ప్రారంభించిన రామాలయ ఉద్యమాన్ని ఇండియా కూటమి నీరుగార్చిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

  • గుజరాత్‌లోనూ ఆ పార్టీకి అయోధ్యగతే

  • అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక ఓడిపోతుంది

  • ఇది తథ్యం.. రాసిపెట్టుకోండి: రాహుల్‌

అహ్మదాబాద్‌, జూలై 6: అయోధ్యలో బీజేపీ అభ్యర్థిని ఓడించడం ద్వారా.. ఆడ్వాణీ ప్రారంభించిన రామాలయ ఉద్యమాన్ని ఇండియా కూటమి నీరుగార్చిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లో కూడా బీజేపీకి అయోధ్యలో పట్టిన గతే పడుతుందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కచ్చితంగా ఓడిపోతుందని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శనివారం రాహుల్‌గాంధీ గుజరాత్‌ పీసీసీ(జీపీసీసీ) కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు.

‘‘అయోధ్యలో బీజేపీ అభ్యర్థి ఓడిపోతారని ఎవరైనా ఊహించారా.. వారాణసీలో మోదీకి అంతతక్కువ మెజారిటీ వస్తుందనుకున్నారా. అలాగే.. గుజరాత్‌లో కూడా మార్పు రానుంది’’ అని వ్యాఖ్యానించారు. గుజరాత్‌ ప్రజలు భయపడవద్దన్నారు. రాహుల్‌గాంధీ లోక్‌సభలో చేసిన ‘హిందూ’ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు ఇటీవల జీపీసీసీ ఆఫీసు వద్ద నిరనస ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యాలయంలో కొద్ది భాగం ధ్వంసమైంది. ఈ నేపథ్యంలోనే ఆయనశనివారం గుజరాత్‌లో పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ‘‘వాళ్లు(బీజేపీ) మన ఆఫీసును ధ్వంసం చేశారు.


మనల్ని బెదిరించాలని చూశారు. కానీ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వారి ప్రభుత్వమే ధ్వంసం కాబోతోంది. ఇది తథ్యం. రాసిపెట్టుకోండి’’ అని అన్నారు. అయోధ్య ప్రజలు మోదీపై ఆగ్రహంతో ఉన్నారని రాహుల్‌ ఈ సందర్భంగా చెప్పారు. ఎయిర్‌పోర్టు కోసం సేకరించిన భూములకు సంబంధించి రైతులకు అక్కడి ప్రభుత్వం ఇంకా పరిహారం చెల్లించలేదన్నారు.

మోదీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో తొలుత అయోధ్యలోనే పోటీ చేయాలని భావించారని, కానీ ఓడిపోతారన్న సమాచారం ఉండటంతో ఆ ఆలోచనను విరమించుకొని వారాణసీలో పోటీ చేశారని చెప్పారు. పార్టీ కార్యకర్తలతో సమావేశం అనంతరం రాహుల్‌ గాంధీ.. గుజరాత్‌ గడిచిన రెండుమూడేళ్లలో జరిగిన పెద్ద పెద్ద ప్రమాదాల్లో చనిపోయినవారి కుటుంబసభ్యులను కలిశారు. రాజ్‌కోట్‌ గేమింగ్‌ జోన్‌ ప్రమాదం, 20222లో మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటన, వడోదరలో పడవ మునిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను రాహుల్‌ కలిసి మాట్లాడారు. వారి సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తానన్నారు

Updated Date - Jul 07 , 2024 | 03:18 AM

Advertising
Advertising
<