ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress: మణిపుర్‌కి వచ్చే సమయం లేదు కానీ రష్యాకు వెళ్తారా.. మోదీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

ABN, Publish Date - Jul 08 , 2024 | 06:18 PM

మణిపుర్‌లో(Manipur Riots) గతేడాది జరిగిన హింసలో బాధితులను పరామర్శించడానికి ప్రధాని మోదీకి(PM Modi) సమయం ఉండట్లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్(Jairam Ramesh) విమర్శించారు. ఒక్కసారీ మణిపుర్‌కి రాని మోదీ.. విదేశీ పర్యటనకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.

ఢిల్లీ: మణిపుర్‌లో(Manipur Riots) గతేడాది జరిగిన హింసలో బాధితులను పరామర్శించడానికి ప్రధాని మోదీకి(PM Modi) సమయం ఉండట్లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్(Jairam Ramesh) విమర్శించారు. ఒక్కసారీ మణిపుర్‌కి రాని మోదీ.. విదేశీ పర్యటనకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.

సోమవారం జై రాం రమేశ్ మాట్లాడుతూ.. లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పటికే రెండుసార్లు మణిపుర్‌లో పర్యటించి.. మూడోసారి వెళ్తుండగా.. మోదీ రష్యా పర్యటనకు వెళ్లడమేంటని ఆయన ప్రశ్నించారు.


'నాన్ బయోలాజికల్(చలనం లేని) ప్రధాని, ఉక్రెయిన్ - రష్యా యుద్ధాన్ని ఆపానని ప్రగల్భాలు పలుకుతూ రష్యా పర్యటనకు వెళ్తున్నారు. మణిపుర్‌లో హింస చెలరేగినా.. ఒక్కసారైనా అక్కడి బాధితులను పరామర్శించలేదు. 14 నెలల్లో రాహుల్ గాంధీ మూడోసారి మణిపుర్‌ బాధితులను భరోసా ఇస్తున్నారు' అని జైరాం పేర్కొన్నారు.

గతేడాది కుకీ, మైతేయి తెగలకు జరిగిన హింసలో 200లకుపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. మహిళలను వివస్త్రలను చేసి రోడ్లపై ఊరేగించిన వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు గస్తీ కాశాయి. అయితే ఈ హింస చెలరేగినప్పటి నుంచి మోదీ ఒక్కసారి కూడా మణిపుర్ పర్యటనకు వెళ్లలేదు. ఇదే అంశంపై విపక్ష కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది.

For Latest News and National News click here

Updated Date - Jul 08 , 2024 | 06:23 PM

Advertising
Advertising
<