National News: వినేశ్ ఫొగట్‌కు కొత్త చిక్కులు.. నోటీసులు జారీ..
ABN, Publish Date - Sep 08 , 2024 | 09:30 PM
క్రీడాకోటాలో రైల్వేలో ఉద్యోగాలు పొందిన రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే రైల్వే శాఖ వారి రాజీనామాలను ఇప్పటివరకు ఆమోదించలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసిన..
క్రీడాకోటాలో రైల్వేలో ఉద్యోగాలు పొందిన రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే రైల్వే శాఖ వారి రాజీనామాలను ఇప్పటివరకు ఆమోదించలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసిన ఇద్దరు రెజ్లర్లకు రైల్వే శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు శుక్రవారం (సెప్టెంబర్6)న తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వినేశ్ ఫొగట్‌కు హర్యానా శాసనసభ ఎన్నికల్లో జులనా నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించగా.. బజరంగ్ పునియాను కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. రైల్వే శాఖ వర్గాల సమాచారం మేరకు బజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్‌లకు షోకాజ్ నోటీసు పంపిం. ఈ ఇద్దరు తమ పదవులకు ఎందుకు రాజీనామా చేశారో తెలియజేయాలని వివరణ కోరింది. ఈ క్రమంలో ఎవరైనా ఉద్యోగస్తులు రాజీనామా చేయాలంటే రైల్వేశాఖలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు ఏమి చెబుతున్నాయో తెలుసుకుందాం.
Elections: అందరి టార్గెట్ జమ్మూకశ్మీర్.. బీజేపీ ఆరో జాబితా విడుదల
చిక్కుల్లో వినేశ్..
వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినా.. వారిని చిక్కులు వీడినట్లు కనిపించడం లేదు. తమ ఉద్యోగాలకు తక్షణమే రాజీనామా చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులకు రాజీనామా లేఖలను పంపించారు. అయితే రైల్వే శాఖ వినేశ్ ఫొగట్ రాజీనామాను తక్షణమే ఆమోదించకపోతే ఆమె ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని కోల్పోవచ్చు. ఫొగట్ హర్యానా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆమె రాజీనామాను రైల్వే శాఖ ఆమోదించాల్సి ఉంటుంది.
Kolkata: ఎంపీ పదవికి రాజీనామా.. సీఎం మమతకు ఘాటు లేఖ
రైల్వే నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
రైల్వేశాఖ నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడు రాజీనామా చేస్తే.. మూడు నెలల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. లేదా తక్షణమే అమలులోకి వచ్చేలా రాజీనామా చేయవచ్చు. మూడు నెలల ముందు నోటీసు ఇస్తే.. ఉద్యోగి మధ్యలో ఎప్పుడైనా తిరిగి ఉద్యోగంలో కంటిన్యూ అవ్వాలని భావిస్తే తన రాజీనామాను ఉపసంహరించుకోవచ్చు. తక్షణమే అమలులోకి వచ్చే విధంగా రాజీనామా చేస్తే ఉపసంహరణకు అవకాశం ఉండదు. ప్రస్తుతం రైల్వే శాఖ రాజీనామాలను ఆమోదించకపోవడంతో రానున్న హర్యానా ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని కోల్పోతారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం, లేదా ప్రభుత్వ పదవుల్లో ఉండి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ముందుగా తమ పదవులుచ, ఉద్యోగాలకు రాజీనామా చేసి ఆ శాఖ నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. నామినేషన్ వేసే సమయంలో ఎన్నికల నామినేషన్ పత్రానికి ఎన్‌వోసిని జతచేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆమోదిస్తారు.
Aadhaar New Rule: ఆధార్ కార్డు జారీ ఇక అంత ఈజీ కాదు
కోర్టుకు వెళ్లే ఛాన్స్..
వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియాకు రైల్వేశాఖ నోటీసు జారీ చేయడంపై ఇద్దరు రెజ్లర్లు ఇంకా స్పందించలేదు. ఇద్దరూ రైల్వేశాఖ షోకాజు నోటీసులకు సమాధానం ఇచ్చినా.. ఆ సమాధానంతో రైల్వే శాఖ సంతృప్తి చెందకపోతే రాజీనామాను ఆమోదించారు. అలాంటి పరిస్థితి ఎదురైతే ఫొగట్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి వస్తే వినేశ్, బజరంగ్ కోర్టును ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు. రాజీనామా ఆమోదంలో జాప్యం జరిగితే ఇద్దరూ కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి.
IMD: ఐఎండీ అలర్ట్.. రేపు రాజస్థాన్ సహా 28 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్
నాలుగు రోజులే..
హర్యానాలో మొత్తం 90 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం స్థానాలకు అక్టోబర్ 5న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం సెప్టెంబర్ 5న నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. సెప్టెంబర్ 12 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. సెప్టెంబర్ 16 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. నామినేషన్ వేసేందుకు వినేశ్‌కు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈలోపు రైల్వేశాఖ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.
National Politics: మీడియాకు దూరంగా ఉండండి.. బ్రిజ్ భూషణ్ సింగ్‌కు నడ్డా సలహా..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News
Updated Date - Sep 08 , 2024 | 09:30 PM