రైల్వే ఉద్యోగులకు బోనస్ బొనాంజా
ABN, Publish Date - Oct 04 , 2024 | 04:54 AM
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పండుగ బోన్‌సను ప్రకటించారు. 11.71 లక్షల మంది రైల్వే సిబ్బందికి రూ.2028.57 కోట్లను ఉత్పాదక అనుసంధానిత బోన్‌సగా చెల్లించనున్నారు.
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పండుగ బోన్‌సను ప్రకటించారు. 11.71 లక్షల మంది రైల్వే సిబ్బందికి రూ.2028.57 కోట్లను ఉత్పాదక అనుసంధానిత బోన్‌సగా చెల్లించనున్నారు. వీటితో పాటు చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండో దశ మూడు కారిడార్లకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. 118.9 కిలోమీటర్ల మార్గంలో 128 స్టేషన్లతో కూడిన ఈ కారిడార్లలో.. మాధవరం-సి్‌పకాట్ (45.8 కి.మీ. 50 స్టేషన్లు), లైట్ హౌస్-పూనమల్లి బైపాస్ (26.1 కిలోమీటర్లు-30 స్టేషన్లు), మాధవరం-షోలింగనల్లూర్ (47 కి.మీ.-48 స్టేషన్లు) ఉన్నాయి.
రూ.63,246 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిచేయాలనేది లక్ష్యం. ప్రధాన పోర్టులు, డాక్ లేబర్ బోర్డు ఉద్యోగుల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంలో మార్పులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2020-21 నుంచి 2025-26 అమల్లో ఉండనుంది. 20,704 మందికి దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. అంతర్జాతీయ ఇంధన హబ్‌లో చేరే ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయంతో 16 దేశాల కూటమిలో ప్రవేశించనుంది. వ్యూహాత్మక ఇంధన విధానాలు, సరికొత్త పరిష్కారాలకు ఇది అవకాశం కల్పిస్తుంది.
Updated Date - Oct 04 , 2024 | 04:54 AM