Lok Sabha Polls: ఇండియా బ్లాక్‌లో చీలిక..? 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆర్జేడీ
ABN, Publish Date - Mar 23 , 2024 | 02:42 PM
బీహార్ ఇండియా కూటమిలో చీలిక వచ్చినట్టే అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీతో ఆర్జేడీ సీట్ల లెక్క తేలలేదు. సంకీర్ణ ధర్మాన్ని రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ విస్మరించింది. కలిసి సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఏకపక్షంగా 13 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. బీహార్ ఫస్ట్ ఫేజ్‌లో ఉన్న 4 నాలుగు స్థానాలు ఇందులో ఉన్నాయి.
పాట్నా: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ విపక్షాల మధ్య ఐక్యత లోపిస్తోంది. కలిసికట్టుగా పోరాడాల్సిన పార్టీలు ఎవరికీ వారే యమునా తీరే అన్నచందంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా బీహార్ (Bihar) ఇండియా కూటమిలో (India Block) చీలిక వచ్చినట్టే అనిపిస్తోంది. కాంగ్రెస్ (Congress) పార్టీతో ఆర్జేడీ సీట్ల లెక్క తేలలేదు. సంకీర్ణ ధర్మాన్ని రాష్ట్రీయ జనతా దళ్ (RJD) పార్టీ విస్మరించింది. కలిసి సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.ఏకపక్షంగా 13 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. బీహార్ (Bihar) ఫస్ట్ ఫేజ్‌లో ఉన్న 4 నాలుగు స్థానాలు ఇందులో ఉన్నాయి. ఆర్జేడీ ఏకపక్షంగా వ్యవహరించడంతో కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉంది.
ఎంపిక ఎలా చేశారంటే..?
ఆర్జేడీ ప్రకటించిన సివాన్, కతిహార్, మధుబని నియోజకవర్గాల మధ్య కూటమిలో విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ మూడు సీట్లను సీపీఎం ఎంఎల్ కూడా ఆశిస్తోంది. కతిహార్ స్థానం కోసం కాంగ్రెస్, సీపీఎం ఎంఎల్ మధ్య గట్టి పోటీ నెలకొంది. మధుబని సీటు కోసం ఆర్డేజీ, సీపీఐ, సీపీఎం పోటీ పడుతున్నాయి. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ సీట్ల కోసం చర్చలు జరుపుతుండగా ఆర్జేడీ అధినేత 13 మంది అభ్యర్థులను ప్రకటించారు. ముస్లిం, యాదవ్, కుష్వాహా ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను ప్రకటించారు.
అభ్యర్థులు వీరే
బంకా- జై ప్రకాశ్ యాదవ్, సరన్- రోహిణి ఆచార్య, ఉజియార్పూర్- అలోక్ మెహతా, పట్లిపుత్ర-మీసా భారతి, బక్సర్- సుధాకర్ సింగ్, జెహనాబాద్- సురేంద్ర యాదవ్, ముంగర్- అనిత్ మహతో, మధుబని- అష్రఫ్ అలి ఫాత్మీ, వైశాలి- రామా సింగ్‌తో 13 నియోజకవర్గాలకు ఆర్జేడీ అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు సీపీఎం ఎంఎల్, సీపీఐ, సీపీఎం కూడా మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాయి. అరాకు సుదామ ప్రసాద్, అవదేష్- రాయ్ బెగుసరాయ్, ఖగారియాకు సంజయ్ కుష్వాహాను ప్రకటించాయి
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 23 , 2024 | 02:42 PM