Summer special trains: నెల్లూరు, ఒంగోలు, విజయవాడ మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు..
ABN, Publish Date - Apr 13 , 2024 | 12:04 PM
వేసవి సెలవులను పురస్కరించుకొని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. - నెం.06507 బెంగళూరు - ఖరగ్‌పూర్(Bangalore - Kharagpur) ప్రత్యేక రైలు ఈనెల 19, 26, మే 3, 10, 17(శుక్రవారం) తేదీల్లో బెంగళూరులో మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరి మూడో రోజు వేకువజామున 2.45 గంటలకు ఖరగ్‌పూర్ చేరుకుంటుంది.
చెన్నై: వేసవి సెలవులను పురస్కరించుకొని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.
- నెం.06507 బెంగళూరు - ఖరగ్‌పూర్(Bangalore - Kharagpur) ప్రత్యేక రైలు ఈనెల 19, 26, మే 3, 10, 17(శుక్రవారం) తేదీల్లో బెంగళూరులో మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరి మూడో రోజు వేకువజామున 2.45 గంటలకు ఖరగ్‌పూర్ చేరుకుంటుంది. మరోమార్గంలో నెం.06508 ఖరగ్‌పూర్ - బెంగళూరు ప్రత్యేక రైలు ఈనెల 15, 22, 29, మే 6, 13, 20 (సోమవారం) తేదీల్లో ఖరగ్‌పూర్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి మరుసటిరోజు రాత్రి 7.50 గంటలకు బెంగళూరు(Bangalore) చేరుకుంటుంది. ఈ రైలు కృష్ణరాజపురం, బంగారుపేట, కుప్పం, జోలార్‌పేట, కాట్పాడి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి(Nellore, Ongole, Vijayawada, Rajahmundry), సామర్లకోట, దువ్వాడ, సింహాచలం నార్త్, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బరంపురం, ఖుర్దా రోడ్డు, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసూర్ స్టేషన్లలో ఆగుతాయి.
ఇదికూడా చదవండి: Kishan Reddy: బీఆర్ఎస్కు ఓటేస్తే.. మూసీ నదిలో వేసినట్టే...
Updated Date - Apr 13 , 2024 | 12:04 PM