PM Modi: అభివృద్ధి చేసే వారికే ప్రజల మద్దతు.. శిమ్లా ప్రచారంలో ప్రధాని మోదీ ఉద్ఘాటన
ABN, Publish Date - May 24 , 2024 | 12:40 PM
దేశాభివృద్ధికి పాటు పడే వారికే ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రధాని మోదీ(PM Modi) ఉద్ఘాటించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం హిమాచల్ ప్రదేశ్‌లో(Himachal Pradesh) పర్యటించారు.
శిమ్లా: దేశాభివృద్ధికి పాటు పడే వారికే ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రధాని మోదీ(PM Modi) ఉద్ఘాటించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం హిమాచల్ ప్రదేశ్‌లో(Himachal Pradesh) పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
"హిమాచల్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోవట్లేదు. వారికెప్పుడు వారసత్వ రాజకీయాలు, అవినీతి, అక్రమాలు చేయడంపైనే ధ్యాస ఉంటుంది. శిమ్లాకు రావడం నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. అభివృద్ధి జరగాలనుకునే వారు తప్పకుండా బీజేపీకి మద్దతు ఇస్తారు. లోక్ సభ ఎన్నికల్లో గతంతో పోల్చితే ఎక్కువ స్థానాల్లోనే బీజేపీ గెలుపొందుతుంది. ప్రతిపక్ష ఇండియా కూటమి ఎన్ని కుట్రలు చేసిన వారు అధికారంలోకి రావడం కల. కూటమి అధికారంలోకి వస్తే ఏడాదికో ప్రధాని మారుతారు.
కాంగ్రెస్ మతాలు, కులాల మధ్య చిచ్చు రేపి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేసి మైనారిటీలకు ఇవ్వాలని చూస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో అలాగే చేయాలని ప్రయత్నించడంతో కోల్‌కతా హైకోర్టు దీదీ సర్కారుకు మొట్టికాయలు వేసింది. రిజర్వేషన్లను రద్దు చేయాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది. వారి కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి. రానున్న ఎన్నికల్లో బీజేపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టాలి" అని మోదీ ఓటర్లను కోరారు.
క్లీన్ స్వీప్ టార్గెట్‌గా బీజేపీ..
ఆరో దశ లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియడంతో ఆయా పార్టీల అధినేతలు ఏడో దశ ఎన్నికలపై దృష్టి పెట్టారు. దేశ వ్యాప్తంగా జూన్ 1న ఏడో దశ పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్‌లో మోదీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన ఇవాళే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 57,11,969 మంది ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల అధికారి మనీష్ గార్గ్ తెలిపారు. 2019లో 53,30,154 మంది ఉండగా 3,81,815 మంది ఓటర్లు పెరిగారని వెల్లడించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలను కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి అన్ని సీట్లల్లో పాగా వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 7 మంది దుర్మరణం.. 20 మందికిపైగా తీవ్ర గాయాలు
Read Latest News and National News here
Updated Date - May 24 , 2024 | 02:46 PM