Arvind Kejriwal Bail: బెయిలు కోసం కేజ్రీవాల్‌కు తప్పని ఎదురుతెన్నులు.. సీబీఐకి అదనపు సమయం ఇచ్చిన సుప్రీంకోర్టు
ABN , Publish Date - Aug 23 , 2024 | 04:27 PM
సీబీఐ నమోదు చేసిన ఎక్సైజ్ పాలసీ కేసులో బెయిలు కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సెప్టెంబర్ 5వ తేదీకి సుప్రీంకోర్టు శుక్రవారం వాయిదా వేసింది. దీంతో బెయిల్ కోసం కేజ్రీవాల్ మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది.
న్యూఢిల్లీ: సీబీఐ (CBI) నమోదు చేసిన ఎక్సైజ్ పాలసీ కేసు (Excise Policey case)లో బెయిలు కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సెప్టెంబర్ 5వ తేదీకి సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం వాయిదా వేసింది. దీంతో బెయిల్ కోసం కేజ్రీవాల్ మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది.
సీబీఐ అరెస్టును సవాలు చేస్తూ ఒక పిటిషన్, బెయిలు కోరుతూ మరో పిటిషన్‌ను కేజ్రీవాల్ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేశారు. ఈ పిటిషన్లలో ఒక దానికి సీబీఐ తన స్పందన తెలియజేయగా, రెండో పిటిషన్‌కు స్పందన తెలియజేసేందుకు మరింత వ్యవధి కావాలని కోర్టును కోరింది. దీంతో రెండో పిటిషన్‌పై సీబీఐ సమాధానం సమర్పించేందుకు కోర్టు వారం రోజులు గడువు ఇచ్చింది.
Kolkata rape-murder case: మమతకు ఝలక్.. ఫెస్టివల్ గ్రాంట్‌ను తోసిపుచ్చిన దుర్గా పూజా కమిటీలు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22లో అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గత మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. దీనికి ముందు 2023 ఫిబ్రవరిలో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అవకతవకల ఆరోపణలపై సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది.
ముంచుకొస్తున్న అసెంబ్లీ ఎన్నికలు
కాగా, కీలకమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025 ప్రథమార్థంలో జరగాల్సి ఉన్నాయి. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాల్లో 62 అసెంబ్లీ స్థానాల్లో 'ఆప్' విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ కేవలం 8 సీట్లకే పరిమితం కాగా, కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవకుండానే చతికిలపడింది.
Read Latest National News And Telugu News