Kejriwal: కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్.. ఎఫ్ఐఆర్ ను తిరస్కరించిన కోర్టు..
ABN, Publish Date - Apr 06 , 2024 | 01:31 PM
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. అరవింద్ కేజ్రీవాల్‌పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను గోవా కోర్టు తిరస్కరించింది. 2017 గోవా ఎన్నికల సమయంలో ఈ కేసు నమోదైంది.
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. అరవింద్ కేజ్రీవాల్‌పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను గోవా కోర్టు తిరస్కరించింది. 2017 గోవా ఎన్నికల సమయంలో ఈ కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్ బహిరంగ సభలో చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. అందరి దగ్గర డబ్బులు తీసుకోండి. కానీ ఓటు మాత్రం చీపురు గుర్తుకే వేయండి అని కేజ్రీవాల్ ( Kejriwal ) ఓటర్లకు సూచించారు. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ ప్రసంగానికి సంబంధించి గోవా పోలీస్ స్టేషన్‌లో కేజ్రీవాల్ పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
YS Sharmila: బీజేపీకి బానిస అయిన జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతారు.. షర్మిల
ప్రజాప్రాతినిధ్య చట్టం, భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 171 (ఇ) లంచానికి సంబంధించిన కేసు నమోదైంది. జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ నవంబర్‌లో ఆయనకు సమన్లు జారీ చేశారు. 2017, 2022లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్ 2017లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయినా 2022 మాత్రం రెండు సీట్లు గెలుచుకుంది. ఈ కేసు విచారణ దాదాపు 7 ఏళ్లు సాగింది. చివరికి శనివారం కీలక తీర్పు వెల్లడిస్తూ ఎఫ్ఐఆర్ ను తిరస్కరించింది. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ దిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.
మార్చిలో ఆయన నివాసంలో ఈడీ అరెస్టు చేసింది. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌కు కూడా సంబంధం ఉందని ఈడీ చెబుతోంది.
మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.
Updated Date - Apr 06 , 2024 | 01:32 PM