ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kejriwal: కేజ్రీవాల్ రాజీనామా డిమాండ్ పిటిషన్ పబ్లిసిటీ కోసమే.. హైకోర్టు

ABN, Publish Date - Apr 08 , 2024 | 03:41 PM

దిల్లీ మద్యం కేసులో అరెస్టైన ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. జైలులో ఉంటూ సమర్థవంతమైన పాలన అందించలేరంటూ తక్షణమే పదవి నుంచి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేశారు.

దిల్లీ మద్యం కేసులో అరెస్టైన ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. జైలులో ఉంటూ సమర్థవంతమైన పాలన అందించలేరంటూ తక్షణమే పదవి నుంచి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఆయన రాజీనామా చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పలువురు కోర్టుకు వెళ్లారు. ఆప్‌ మాజీ ఎమ్మెల్యే సందీప్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఇది కేవలం పబ్లిసిటీ కోసం చేసిన పని అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు జస్టిస్ ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


Kangana Ranaut: నేను గొడ్డు మాంసం తినను.. కాంగ్రెస్ నేతకు కంగనా స్ట్రాంగ్ కౌంటర్..

దిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించడంలో కేజ్రీవాల్ అసమర్థత కలిగి ఉన్నారని ఆరోపిస్తూ సందీప్ కుమార్ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Elections 2024: మోదీ వర్సెస్ దీదీ.. బెంగాల్ లో మంట పుట్టిస్తున్న ఎన్నికల ప్రచారం..


గతంలోనూ కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు తిరస్కరించింది. ఏప్రిల్ 4న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ పీఎస్ అరోరాలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై పిటిషన్ ను స్వీకరించేందుకు నిరాకరించింది, ముఖ్యమంత్రిగా కొనసాగడం కొనసాగకపోవడం అనేది కేజ్రీవాల్ వ్యక్తిగత అభిప్రాయం అని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 08 , 2024 | 03:41 PM

Advertising
Advertising