CAA: వారికి సున్తీ పరీక్ష చేయండి.. గవర్నర్ వ్యాఖ్యలపై దుమారం..
ABN, Publish Date - Mar 18 , 2024 | 08:23 PM
సీఏఏపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రాజుకుంటున్నాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని కొందరు వ్యతిరేకిస్తుండగా మరికొందరు స్వాగతిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు రాజకీయ నేతలు చేసిన కామెంట్లు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
సీఏఏపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రాజుకుంటున్నాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని కొందరు వ్యతిరేకిస్తుండగా మరికొందరు స్వాగతిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు రాజకీయ నేతలు చేసిన కామెంట్లు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మేఘాలయ మాజీ గవర్నర్ తథాగత రాయ్ చేసిన కామెంట్లు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సీఏఏ ( CAA ) ద్వారా పౌరసత్వం ఇచ్చే మగవాళ్లకు సున్తీ పరీక్ష చేయాలంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. సీఏఏ పై ప్రజలకు టీఎంసీ తప్పుదోవ పట్టిస్తోందన్న తథాగత రాయ్.. ప్రభుత్వం మేల్కొని అవగాహన కల్పించాలని కోరారు. బెంగాల్ నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్లి అక్కడ ఇస్లామిక్ హింసకు గురవుతున్న మైనారిటీలకు మాత్రమే ఇండియాలో పౌరసత్వం లభిస్తుందని ఆయన గతంలో ఎక్స్ లో పోస్ట్ చేశారు.
మాజీ గవర్నర్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు విషపూరిత సంస్కృతికి ఉదాహరణగా నిలుస్తున్నాయని మండిపడ్డారు. వివక్షత, అమానవీయ వ్యాఖ్యలకు సమాజంలో స్థానం లేదని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన తథాగత రాయ్ మత ప్రతిపాదికన పురుషుడు సున్తీ పరీక్ష చేస్తే అతను ఏ మతానికి చెందిన వాడో అర్థమవుతుందన్నారు. ముస్లింలను పౌరసత్వం ఇవ్వడాన్ని సీఏఏ పూర్తిగా మినహాయించినందున తాను ఈ కామెంట్స్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 18 , 2024 | 08:31 PM