Tribal Man: దొంగతనం కేసులో అదుపులోకి..
ABN , Publish Date - Jul 16 , 2024 | 06:14 PM
ఓ గిరిజన యువకుడిపై పోలీసులు విచక్షణ రహితంగా ప్రవర్తించారు. పెళ్లి జరిగే సమయంలో కనికరించలేదు. వివాహ ఊరేగింపు జరుగుతుండగా స్టేషన్ తీసుకెళ్లారు. అప్పటి వరకు బాగానే ఉన్న యువకుడు.. స్టేషన్ వెళ్లాక ఛాతీలో నొప్పి అని చెప్పాడట.. ఆస్పత్రికి తీసుకెళ్లామని, ఫలితం లేదని పోలీసులు కట్టు కథ అల్లారు. ఈ విషయం చెబుతూ ఆ యువకుడి బంధువులు మండిపడ్డారు.
ఓ గిరిజన యువకుడిపై (Tribal Man) పోలీసులు విచక్షణ రహితంగా ప్రవర్తించారు. పెళ్లి జరిగే సమయంలో కనికరించలేదు. వివాహ ఊరేగింపు జరుగుతుండగా స్టేషన్ తీసుకెళ్లారు. అప్పటి వరకు బాగానే ఉన్న యువకుడు.. స్టేషన్ వెళ్లాక ఛాతీలో నొప్పి అని చెప్పాడట.. ఆస్పత్రికి తీసుకెళ్లామని, ఫలితం లేదని పోలీసులు కట్టు కథ అల్లారు. ఈ విషయం చెబుతూ ఆ యువకుడి బంధువులు మండిపడ్డారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన దేవ్‌ను కొట్టి చంపేశారని వాపోయారు.
ఇదీ విషయం..
మధ్యప్రదేశ్ గుణలో ఈ ఘటన జరిగింది. పార్థీ కులానికి చెందిన దేవ్‌ను ఆదివారం రాత్రి పోలీసులు తీసుకెళ్లారు. ఓ దొంగతనం కేసులో స్టేషన్ తీసుకెళ్లారు. అతనితో అంకుల్ (చిన్నాన్న) ఉన్నారు. వివాహ ఊరేగింపు నుంచి ఇద్దరిని ఈడ్చుకెళ్లారు. తర్వాత వస్తారులే అనుకున్నారు. రాత్రి ఫోన్ చేసి దేవ్‌కు గుండె పోటు వచ్చిందని పోలీసులు చెప్పారు. ఆస్పత్రికి తీసుకెళ్లామని, ప్రాణాలు దక్కలేవని వివరించారు. దాంతో దేవ్ బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
Rahul Gandhi: దోడా ఎన్‌కౌంటర్‌పై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు
ఉద్రిక్తతకు దారితీసిన ఆందోళన
ఆ మరునాడు కలెక్టరేట్ వద్దకు దేవ్ బంధువులు వచ్చారు. అక్కడ తమ నిరసన ప్రదర్శన చేపట్టారు. కొందరు మహిళలు మైదానంలో కూర్చొని నినాదాలు చేశారు. మరికొందరు బోరుమని విలపించారు. ఇంకొందరు తమ బట్టలు (బ్లౌజ్) విప్పి నిరసన తెలియజేశారు. కలెక్టరేట్ వద్ద పరిస్థితి దిగజారింది. అక్కడున్న వారిని బయటకు పంపించేందుకు ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో దేవ్ బంధువులతో వాగ్వివాదం జరిగింది. తోపులాటకు దారితీసింది. పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దాంతో మహిళల గాజులు పగిలాయి. ఒకరి నుదురుపై గాయమై రక్తం కారింది. ‘యువకుడికి గుండెపోటు ఎలా వస్తోంది. దేవ్‌ను పోలీసులు కొట్టి చంపారు. అతని అంకుల్‌పై దాడి చేశారు అని’ ఆ మహిళలు ప్రశ్నించారు. దేవ్ మృతిచెందాడని తెలిసి పెళ్లి కూతురు, దేవ్ ఆంటీ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నారు. మరికొన్ని గంటల్లో పెళ్లి జరుగుతుండగా, వరుడిని కొట్టి చంపారని బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
For Latest News and National News click here