UttarPradesh: పసి కందుల సజీవ దహనానికి కారణమిదే.. | UP Hospital Fire That Killed 11 Babies Accidental, Finds Panel: Sources VVNP
Share News

UttarPradesh: పసి కందుల సజీవ దహనానికి కారణమిదే..

ABN , Publish Date - Nov 17 , 2024 | 07:05 PM

ఉత్తరప్రదేశ్‌లో అతి పెద్ద ఆసుపత్రుల్లో ఒకటి.. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఝాన్సీ మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీ ఆసుపత్రి. నవంబర్ 15 అంటే.. శుక్రవారం రాత్రి ఈ ఆసుపత్రిలోని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో 11 మంది పసికందులు సజీవ దహనమయ్యారు.

UttarPradesh: పసి కందుల సజీవ దహనానికి కారణమిదే..

లక్నో, నవంబర్ 17: ఉత్తరప్రదేశ్‌‌లోని ఝాన్సీ లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో నవజాత శిశువు విభాగంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందని.. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న ఇద్దరు సభ్యుల కమిటీ స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన నివేదికను సదరు కమిటీ.. ఆదివారం ప్రభుత్వానికి నివేదించింది. ఈ ఘటన ఉద్దేశ పూర్వకంగా జరిగింది కాదని తెలిపింది. అలాగే ఈ ఘటనలో ఎలాంటి నేర పూరిత కుట్ర కోణం కానీ.. నిర్లక్ష్యం కానీ లేదని వివరించింది. స్విచ్‌బోర్డ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగాయని పేర్కొంది. నవజాత శిశువుల వార్డులో స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయక పోవడంతో మంటలను అదుపులోకి తీసుకు రాలేకపోయారని తమ దర్యాప్తులో తేలిందని కమిటీ సభ్యులు వెల్లడించారు.

Also Read: వాహన కొనుగోలు దారులకు గుడ్ న్యూస్

ABN ఛానల్ ఫాలో అవ్వండి

ఇక ఈ ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే.. పారా మెడికల్ సిబ్బంది అగ్నిమాపక నియంత్రణ పరికరాలతో లోపలికి వెళ్లారు. అయితే అప్పటికే స్విచ్‌బోర్డ్ నుండి మంటలు ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్ వైపు వేగంగా వ్యాపించాయి. దీంతో అగ్నికీలలను అదుపులోకి తీసుకు రాలేకపోయినట్లు సదరు కమిటీ.. తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకున్నాయని.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పేర్కొంది.

Also Read: ఐదు రోజుల పాటు భారీ వర్షాలు


ఉత్తరప్రదేశ్‌లో అతి పెద్ద ఆసుపత్రుల్లో ఒకటి.. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఝాన్సీ మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీ ఆసుపత్రి. నవంబర్ 15 వ తేదీ అంటే.. శుక్రవారం రాత్రి ఈ ఆసుపత్రిలోని నవజాత శిశువుల విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 11 మంది పసికందులు సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.

Also Read: చిన్న ఉసిరి వల్ల ఇన్ని లాభాలున్నాయా..?


ఆ క్రమంలో ఝాన్సీ కమిషనర్ విపుల్ దూబే, డీఐజీ కళానిధి నాథని కమిటీ విచారణ జరిపి.. 48 గంటల్లో నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో.. ఈ విభాగంలో ఇద్దరు వైద్యులు, ఆరుగురు నర్సులతోపాటు పలువురు సిబ్బంది ఉన్నారు. వారిలో పలువురికి సైతం గాయాలయ్యాయి.

Also Read: ఎన్నికల ప్రచారంలో నవనీత్ కౌర్‌పై దాడి


మరోవైపు ఇదే ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింజల్ సింగ్ అధ్యక్షతన నలుగురు సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వార్డులో షార్ట్ సర్క్యూట్‌ ఎలా జరిగింది? వార్డులో యంత్రాలు ఓవర్ లోడ్‌ అయ్యాయా? నిర్లక్ష్యం చేశారా? తదితర అంశాలపై ఈ కమిటీ సమగ్ర దర్యాప్తు చేపట్టనుంది. ఈ నివేదికను త్వరలో యోగి ప్రభుత్వానికి ఈ కమిటీ అందజేయనుంది.


అలాగే భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలనే అంశాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి ఈ నలుగురు సభ్యుల కమిటీ అందజేయనుంది. ఈ కమిటీ.. తన నివేదికను మరో నాలుగు రోజుల్లో ఇచ్చే అవకాశముందని తెలుస్తుంది.


ఇంకోవైపు ఉత్తరప్రదేశ్‌లోని పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదానికి రాజకీయ రంగు పులుముకుంది. దీంతో యోగి సర్కార్‌పై ప్రతిపక్షాలు.. విమర్శల దాడికి దిగాయి. అటువంటి వేళ.. ఈ ప్రమాదం.. షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందంటూ ఇద్దరు సభ్యుల కమిటీ తన ప్రాథమిక నివేదిలో స్పష్టం చేసింది.

For National news And Telugu News

Updated Date - Nov 17 , 2024 | 07:21 PM