ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Yogi Adithyanath: సనాతన ధర్మాన్ని దెబ్బతీసేందుకు కుట్ర.. మమతపై యోగి ఫైర్..

ABN, Publish Date - Apr 20 , 2024 | 04:18 PM

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ( Mamata Banerjee ) ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రామనవమి వేడుకల సందర్భంగా బెంగాల్ లోని ముర్షిదాబాద్ లో జరిగిన హింసపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ( Mamata Banerjee ) ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రామనవమి వేడుకల సందర్భంగా బెంగాల్ లోని ముర్షిదాబాద్ లో జరిగిన హింసపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన నమ్మకాన్ని దెబ్బతీసేందుకు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ భక్తులపై దాడులు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో రామనవమి వేడుకలతో పాటు ఊరేగింపులు సజావుగా జరిగాయన్నారు. కానీ పశ్చిమ బెంగాల్ లో మాత్రం దాడులు జరిగాయని, ఇది సనాతన ధర్మాన్ని దెబ్బ తీసే కుట్ర అని ఆక్షేపించారు. ప్రధాని మోదీ నాయకత్వం, మార్గదర్శకత్వంలోని బీజేపీ దేశంలో భద్రతను మెరుగుపరిచిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.


Amit Shah: సొంత కారు లేదు.. రూ.15 లక్షల అప్పు ఉంది.. అమిత్ షా ఆస్తుల విలువ ఇవే..

ప్రధాని మోదీ జాతీయవాదం, అభివృద్ధి, భద్రత, సుపరిపాలన కారణంగా రాజస్థాన్‌ లో బీజేపీకి గణనీయమైన మెజారిటీ దక్కిందని సీఎం యోగి పేర్కొన్నారు. గత ఎన్నికల మాదిరిగానే రాజస్థాన్ లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ మంచి పనితీరు కనబరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో బీజేపీకి 25 సీట్లు దక్కాయని, ఈసారి రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ వందశాతం సీట్లు సాధిస్తుందని ఉత్తరప్రదేశ్ సీఎం స్పష్టం చేశారు.


Supreme Court: పిల్లలతో పోర్న్ వీడియోలు చేయడం తీవ్ర నేరమే.. సుప్రీంకోర్టు

కాగా.. ఎన్నికల నేపథ్యంలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ముందస్తు ప్రణాళికతోనే ఊరేగింపుపై దాడి జరిగిందని మమతా బెనర్జీ అన్నారు. ఘటనకు పాల్పడేందుకు వీలుగా రామనవమికి ఒక రోజు ముందు ముర్షిదాబాద్ డీఐజీని తొలగించారని విమర్శించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 20 , 2024 | 04:18 PM

Advertising
Advertising