ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rain Alert: భారీ వర్ష సూచన.. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు..

ABN, Publish Date - Jul 15 , 2024 | 04:39 PM

Weather Alert: కేరళ, గోవా, మహారాష్ట్ర, ఒడిస్సా, మేఘాలయ, అస్సాం, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో..

Weather

Weather Alert: కేరళ, గోవా, మహారాష్ట్ర, ఒడిస్సా, మేఘాలయ, అస్సాం, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడం, ఈదూరు గాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో అధికారులు.. స్కూళ్లు, కాలేజీలు సహా అన్ని విద్యా సంస్థలకుసెలవులు ప్రకటిస్తున్నారు. అంతేకాదు.. రానున్న రోజుల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో.. మరింత అలర్ట్ అయ్యారు.


భారీ వర్షాల దృష్ట్యా కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు సహా అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి. గోవాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో జులై 15, 16 తేదీల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.


కేరళలోని మలప్పురం, కన్పూర్, కాసర్‌గోడ్‌లకు సోమవారం రెడ్ అలర్ట్ ప్రకటించగా.. ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్, కోజికోడ్, వాయనాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో.. త్రిసూర్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసరగోడ్, ఎర్నాకులం, వాయనాడ్‌తో సహా ఏడు జిల్లాల్లోని అన్ని పాఠశాలలు మూసివేశారు.


ఉత్తర కన్నడ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని కార్వార్, అంకోలా, కుంటా, హొన్నావర్, భత్కల్, సిర్సి, సిద్దాపూర్, ఎల్లాపూర్, దండేలి, జోయిడా తాలూకాలలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. వాతావరణం అనుకూలించే వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది.


వాతావరణ శాఖ ప్రకటన..

జులై 16 వరకు గోవా, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. జులై 17, 18న ఓడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో జులై 17వ వరకు భారీ వర్షాలు కురుస్తాయి. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో జూలై 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

For More National News and Telugu News..

Updated Date - Jul 15 , 2024 | 04:39 PM

Advertising
Advertising
<