Share News

lok sabha election 2024: పోలింగ్ కేంద్రానికి దొంగలు..ఓటింగ్ పత్రాలు చోరీ, మెషీన్లు చెరువులో విసిరివేత

ABN , Publish Date - Jun 01 , 2024 | 11:52 AM

దేశవ్యాప్తంగా లోక్‌సభ 2024(lok sabha election 2024) చివరి దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఓటింగ్ ప్రారంభానికి ముందే పశ్చిమ బెంగాల్‌(west bengal) రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

lok sabha election 2024: పోలింగ్ కేంద్రానికి దొంగలు..ఓటింగ్ పత్రాలు చోరీ, మెషీన్లు చెరువులో విసిరివేత
polling violence West Bengal

దేశవ్యాప్తంగా లోక్‌సభ 2024(lok sabha election 2024) చివరి దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఓటింగ్ ప్రారంభానికి ముందే పశ్చిమ బెంగాల్‌(west bengal) రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. జయనగర్(Jayanagar) పార్లమెంటరీ నియోజకవర్గంలోని సెక్టార్ అధికారి కస్టడీ నుంచి ఈవీఎంలు, పోలింగ్ పత్రాలను పలువురు దుండగులు వచ్చి ఎత్తుకెళ్లారని అధికారులు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటించారు.


ఉదయం 6.40 గంటలకు బేనిమాధవ్‌పూర్ ఎఫ్‌పీ స్కూల్ సమీపంలోని సెక్టార్ ఆఫీసర్ రిజర్వ్ ప్రాంతంలో ఈవీఎంలు, పేపర్లను దుండగులు దోచుకెళ్లారని చెప్పారు. ఆ క్రమంలో జయ్‌నగర్ (ఎస్‌సి) పీసీ, 129 కుల్తాలి ఎసీ వద్ద దొంగల గుంపు వచ్చి దోచుకుందని వెల్లడించారు. అంతేకాదు 1 సీయూ, 1 బీయూ, 2 వీవీప్యాట్ యంత్రాలను కూడా చెరువులో పడేశారని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆ పోలింగ్ కేంద్రంలో టీఎంసీ ప్రాక్సీ ఓటింగ్‌కు పాల్పడిందని బీజేపీ ఆరోపించింది.


ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, ఆ సెక్టార్‌లో పోలింగ్ ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపలేదని సీఈఓ తెలిపారు. ఆ సెక్టార్ పరిధిలో ప్రస్తుతం మొత్తం ఆరు బూత్‌లలో ఎన్నికల ప్రక్రియ అంతరాయం లేకుండా కొనసాగుతుందని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల ఏడవ, చివరి దశలో ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 57 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది.


ఇది కూడా చదవండి:

56 degrees : నాగపూర్‌లో 56 డిగ్రీలు

BOI : బీఓఐ 666 రోజుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం

For Latest News and National News click here

Updated Date - Jun 01 , 2024 | 12:17 PM