Share News

నాల్కోలో టెన్త్‌, ఐటీఐ వారికి ఉద్యోగాలు

ABN , Publish Date - Dec 30 , 2024 | 04:44 AM

ప్రభుత్వ రంగ సంస్థ ‘నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌’(నాల్కో) నుంచి 518 నాన్‌ ఎగ్జిక్యూటీవ్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ వెలువడింది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌ ద్వారా...

నాల్కోలో టెన్త్‌, ఐటీఐ వారికి ఉద్యోగాలు

ప్రభుత్వ రంగ సంస్థ ‘నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌’(నాల్కో) నుంచి 518 నాన్‌ ఎగ్జిక్యూటీవ్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ వెలువడింది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి జూనియర్‌ ఆపరేటీవ్‌ ట్రైనీలుగా నియమిస్తారు.

లాబొరేటరీ: 37 పోస్టులు- కెమిస్ట్రీ సబ్జెక్టుగా బీఎసీ ఆనర్స్‌ చదివి ఉండాలి.

ఆపరేటర్‌: 226 పోస్టులు. టెన్త్‌, ఐటీఐ చేసి ఎలకా్ట్రనిక్స్‌, మెకానిక్స్‌, టెక్నీషియన్‌ మెకట్రానిక్స్‌, ఎలక్ట్రీషియన్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, ఫిట్టర్‌ ట్రేడ్‌లలో ఏదో ఒకటి చేసి ఉండాలి.

ఫిట్టర్‌: 72 పోస్టులు-టెన్త్‌, ఫిట్టర్‌ ట్రేడ్‌లో ఐటీఐ అప్రెంటి్‌సషిప్‌ చేసి ఉండాలి.

ఎలక్ట్రికల్‌: 63 పోస్టులు-టెన్త్‌, ఐటీఐ ఎలక్ట్రీషియన్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి

ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌: 48 పోస్టులు- టెన్త్‌, మెకానిక్‌ ట్రేడ్‌లో రెండు సంవత్సరాల ఐటీఐ అప్రెంటి్‌సషిప్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.

మైనింగ్‌ మేట్‌: 15 పోస్టులు - టెన్త్‌, మైనింగ్‌ మేట్‌ సర్టిఫికెట్‌

మోటార్‌ మెకానిక్‌: 22 పోస్టులు-టెన్త్‌, మోటార్‌ మెకానిక్‌ ట్రేడ్‌లో రెండు సంవత్సరాల ఐటీఐ అప్రెంటి్‌సషిప్‌ సర్టిఫికెట్‌.


నర్స్‌(గ్రేడ్‌-3): 7 పోస్టులు- ఇంటర్‌తోపాటు, మూడు సంవత్సరాల జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ ట్రైనింగ్‌ ఉండాలి. లేదా డిప్లొమా/బీఎస్సీ నర్సింగ్‌, ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.

ఫార్మసిస్ట్‌: 6 పోస్టులు- సైన్స్‌ సబ్జెక్టుతో ఇంటర్‌, ఫార్మసీ డిప్లొమా ఉండాలి. కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉంటే ప్రాధాన్యం.

  • లాబొరేటరీ, ఫస్ట్‌ఎయిడ్‌ తదితరాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి వయసు 35 సంవత్సరాలు నిండి ఉండరాదు. మైనింగ్‌కు 28, ఇతర పోస్టులకు 27 సంవత్సరాలు దాటరాదు. అభ్యర్థులు ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్సేంజ్‌లో రిజిస్టర్‌ చేసుకొని ఉండాలి. 2024 డిసెంబరు 31 నుంచి 2025 జనవరి 21 తేదీలోపు దరఖాస్తులు స్వీకరిస్తారు. పూర్తి వివరాలకు జ్ట్టిఞట://ుఽ్చజూఛిౌజీుఽఛీజ్చీ.ఛిౌఝ/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

Updated Date - Dec 30 , 2024 | 04:48 AM