Share News

ఎస్‌బీఐలో పీఓలు 600

ABN , Publish Date - Dec 30 , 2024 | 04:47 AM

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 600 ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2025 జనవరి 16 తేదీ వరకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో...

ఎస్‌బీఐలో పీఓలు 600

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 600 ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2025 జనవరి 16 తేదీ వరకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో దాఖలు చేసుకోవాలి. అభ్యర్థులను ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు: ప్రొబేషనరీ ఆఫీసర్‌ 600 పోస్టులు (ఎస్సీ-87, ఎస్టీ-57, ఓబీసీ-158,ఈ డబ్ల్యూఎస్‌-58, యూఆర్‌-240)

అర్హతలు: ఏదైనా సబ్జెక్టులతో బ్యాచిలర్‌ డిగ్రీ, ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి(2024 ఏప్రిల్‌ 1 నాటికి) (1994 ఏప్రిల్‌ 2 - 2003 ఏప్రిల్‌ 1 మధ్యలో జన్మించి ఉండాలి). వివిధ వర్గాల వారికి కేటగిరీలను అనుసరించి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఫీజు: రూ.750/- (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు చెల్లింపులో కొంత మినహాయింపు ఉంది)

చివరి తేదీ: 2025 జనవరి 16

ప్రిలిమినరీ పరీక్ష: మార్చి 8, 15న నిర్వహిస్తారు.


ఎంపిక విధానం

ప్రిలిమినరీ: వంద మార్కులకు వంద ప్రశ్నలుంటాయి. ఒక గంట సమయంలో పూర్తి చేయాలి. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. ఇంగ్లీషు 40 ప్రశ్నలు, క్వాంటిటేటీవ్‌ ఆప్టిట్యూడ్‌ 30 ప్రశ్నలు, రీజనింగ్‌ ఎబిలిటీ 30 ప్రశ్నలు

మెయిన్స్‌: మొత్తం 200 మార్కులకు 170 ప్రశ్నలు ఉంటాయి. మూడు గంటల్లో పూర్తి చేయాలి. రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌(40 ప్రశ్నలు-60 మార్కులు), డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంట్రప్రెటేషన్‌(30 ప్రశ్నలు-60 మార్కులు), జనరల్‌ అవేర్‌నెస్‌/ఎకానమీ/ బ్యాంకింగ్‌ నాలెడ్జ్‌(60 ప్రశ్నలు, 60 మార్కులు), ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ (40 ప్రశ్నలు, 20 మార్కు లు). డిస్ర్కిప్టివ్‌ పేపర్‌ 50 మార్కులకు ఉంటుంది. దీనిని 30 నిమిషాల్లో పూర్తి చేయాలి.

ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, చిత్తూరు, ఏలూరు, గుం టూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం.

వివరాలకు bank.sbi/web/careers/current-openings వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Updated Date - Dec 30 , 2024 | 04:52 AM