Awareness : ఆహారం ఇలా సురక్షితం
ABN, Publish Date - Jun 11 , 2024 | 12:24 AM
ఆహారాన్ని శుచిగా తయారు చేసుకోవడమెలాగో తెలిస్తే సరిపోదు. పోషకాలు నష్టపోకుండా ఎలా వండుకోవాలో, ఎలా నిలువ చేసుకోవాలో కూడా తెలిసి ఉండాలి. అప్పుడే పోషక నష్టాన్ని అరికట్టగలుగుతాం.
అవేర్నెస్
ఆహారాన్ని శుచిగా తయారు చేసుకోవడమెలాగో తెలిస్తే సరిపోదు. పోషకాలు నష్టపోకుండా ఎలా వండుకోవాలో, ఎలా నిలువ చేసుకోవాలో కూడా తెలిసి ఉండాలి. అప్పుడే పోషక నష్టాన్ని అరికట్టగలుగుతాం.
శుభ్రంగా ఉండేలా...
పదార్థాలను తాకేటప్పుడు, వంట వండేటప్పుడు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి
టాయిలెట్ వాడిన ప్రతిసారీ చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి
వంటకు ఉపయోగించే పరికరాలు (కత్తులు, చాపింగ్ బోర్డ్, మిక్సీ గిన్నెలు, పాత్రలు), ప్రదేశాలు శానిటైజ్ చేస్తూ ఉండాలి
వంటింట్లో ఎలుకలు, బొద్దింకలు, చీమలు లాంటివి లేకుండా చూసుకోవాలి
వీటిని వేర్వేరుగా...
పచ్చి మాంసం, గుడ్లు, సముద్రాహారాలను ఇతర పదార్థాలకు దూరంగా ఉంచాలి
కూరగాయలకూ, మాంసాహారినికీ ఒకే కత్తి, చాపింగ్ బోర్డ్, పాత్రలు ఉపయోగించకూడదు
పచ్చివాటినీ, ఉడికించిన వాటికీ వేర్వేరు పాత్రలు కేటాయించాలి
బాగా ఉడికించాలి
మాంసం, చేపలు, గుడ్లు, సముద్రాహారాలను బాగా ఉడికించాలి.
సూప్స్, స్ట్యూలను 70 డిగ్రీల సెంటేగ్రేడ్కు చేరుకునే వరకూ ఉడికించాలి. ఇవి చల్లారిపోతే, తిరిగి వేడి చేసిన తర్వాతే తినాలి
సురక్షితమైన తాపమానాల్లో...
వంటకాలను రెండు గంటలకు మించి గది ఉష్ణోగ్రతలో ఉంచకూడదు
పాడయ్యే వీలున్న పదార్థాలతో పాటు, వండిన వంటకాలన్నింటినీ 5 డిగ్రీల కంటే తక్కువ తాపమానంలో నిల్వ చేసుకోవాలి
వడ్డించే ముందు, పదార్థాలన్నీ 60 డిగ్రీల సెంటేగ్రేడ్కు మించి ఉండేలా చూసుకోవాలి
రెఫ్రిజిలేటర్లో పదార్థాలను ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసి పెట్టుకోకూడదు
గడ్డకట్టిన పదార్థాలను గది ఉష్ణోగ్రతలో సాధారణ తాపమానానికి చేరుకునేలా వదిలేసి తినకూడదు
శుభ్రత ఇలా...
పాశ్చురైజ్డ్ పాలలా, సురక్షితమైన పద్ధతిలో ప్రాసెస్ చేసిన పదార్థాలను ఎంచుకోవాలి
సలాడ్, ఫ్రూట్ సలాడ్స్ కోసం పండ్లు, కూరగాయలను కోసుకునే ముందు వాటిని శుభ్రంగా కడుక్కోవాలి
అవెంత తాజాగా కనిపించినా, ఎక్పైరీ డేట్ దాటిన పదార్థాల జోలికి వెళ్లకూడదు.
Updated Date - Jun 11 , 2024 | 12:24 AM