Share News

Health Tips : వర్షాకాలంలో ఈ పండ్లు తింటే ఎన్ని లాభాలో..

ABN , Publish Date - Aug 15 , 2024 | 10:51 AM

ఎముక ఆరోగ్యానికి కూడా అలూ బుఖారా పండ్లు సహకరిస్తుంది. అలూ బుఖారా పండ్లలో ప్రత్యేకమైన ఫైటోన్యూట్రియెంట్లు, నియోక్ క్లోరోజెనిక్ యాసిడ్ వంటి క్యాన్సర్ నిరోధక ఏజెంట్లను కలిగి ఉంది.

Health Tips : వర్షాకాలంలో ఈ పండ్లు తింటే ఎన్ని లాభాలో..
Health Benefits

అలూ బుఖారా పండ్లు అనేది తీపి, జ్యూసీ పండు. గట్టిగా ఉండే ఈ పండు మృదువైన చర్మంతో ఉంటుంది. ఎరుపు, ఊదా రంగుల, ఆకుపచ్చ, పసుపు లేదా నారింజ రంగుల్లో కనిపించే ఈ పండ్లు పరిమాణంలో మాత్రం చిన్నగానే కనిపిస్తాయి. వీటినే అలూ బుఖారా పండ్లు అంటాం.

కొంచెం తీపి, కొంచెం పులుపు కలిపినట్లుగా ఉండే ఈ రుచితో పాటు అనేక ఆరోగ్యపోషకాలను కూడా కలిగి ఉంది. ఇందులో ఇసాటిన్, సార్బిటాల్ సమ్మేళనాలున్నాయి. ఇవి మలబద్దకాన్ని తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ప్రేగు ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఈ పండు అధిక ఫైబర్ కారణంగా ఇది నీటితో కలవదు. కార్బోహైడ్రేట్సు కూడా ఎక్కువే. ఇవి అడిపోనెక్టిన్ అనే హార్మోన్ స్థాయిలను పెంచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.

ఈ అలూ బుఖారా పండు కాకుడు రేగు చెట్టు నుంచి వచ్చింది. ఈ చెట్టు ఆస్ట్రేలియాకు చెందినది. సాధారణంగా ఈ చెట్టు ఉష్ణమండల అడవులలో కనిపిస్తుంది. ఈ జావా ప్లం చెట్టును అలూ బుకారా అనేకాకుండా జామూన్ లేదా మలబార్ ప్లం అని కూడా పిలుస్తారు. భారతదేశం, ఉష్ణమండల ప్రాంతాలకు చెందిన ఈ పండు సిజిజియం క్యుమిని జాతికి చెందినది. కడుపు నొప్పి, జీర్ణ సమస్యలకు ఉత్తమమైన ఇంటి నివారణగా పనిచేస్తుంది. ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది.

Health Tips : క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే రెడ్ ముల్లంగి


Tulasi Plant : వర్షాకాలంలో తులసి మొక్కను ఎలా పెంచాలో తెలుసా..!

గుండె జబ్బులు..

అలూ బఖారా పండ్లలో ఫైటోకెమికల్స్, పోషకాలు ఉన్నాయి . ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఆందోళన..

రోజుకు ఒక పండు చొప్పున తినడం వల్ల యాంటీఆక్సిడెంట్లు తక్కువగా ఉన్న్పపుడు ఆందోళన ఎక్కువగా ఉంటుంది.

Skin Care : చర్మం పొడిబారుతుంటే దానికి కారణాలు, నివారణలు ఇవిగో...!


అధిక రక్తపోటు..

మూత్ర విసర్జన చేసినప్పుడు శరీరం సోడియంను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్లు..

ఈ పదార్థం మధుమేహం, అల్జీమర్స్ వ్యాధి, పార్కిన్సన్స్ వ్యాధి, క్యాన్సర్‌కు దారితీసే సెల్, కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది.

ఎముక ఆరోగ్యానికి కూడా అలూ బుఖారా పండ్లు సహకరిస్తుంది. అలూ బుఖారా పండ్లలో ప్రత్యేకమైన ఫైటోన్యూట్రియెంట్లు, నియోక్ క్లోరోజెనిక్ యాసిడ్ వంటి క్యాన్సర్ నిరోధక ఏజెంట్లను కలిగి ఉంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Aug 15 , 2024 | 10:51 AM