Share News

Littles : నిజాయితీ

ABN , Publish Date - Jul 09 , 2024 | 01:17 AM

ఒక ఊరిలో రామయ్య, రాజయ్యఅనే ఇద్దరు వర్తకులు ఉండేవారు వారిద్దరికీ వ్యాపారంలో చాలా పోటీ ఉండేది. ఒకరోజు రాజయ్య దగ్గరికి తేజఅనే యువకుడు వచ్చి,ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అడిగాడు.

Littles : నిజాయితీ

Littles : ఒక ఊరిలో రామయ్య, రాజయ్యఅనే ఇద్దరు వర్తకులు ఉండేవారు వారిద్దరికీ వ్యాపారంలో చాలా పోటీ ఉండేది. ఒకరోజు రాజయ్య దగ్గరికి తేజఅనే యువకుడు వచ్చి,ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అడిగాడు. అందుకు రాజయ్య ఆ యువకుడిని అలా అడిగాడ ‘ఏం బాబూ? నువ్వు ఇంతకు ముందు ఆ రామయ్య దగ్గర పని చేశావు రదూ, అక్కడ పని ఎందుకు మానేశావు? అని అడిగాడు. దానికి తేజ అక్కడ జీతం సరిపోవట్లేదు అని మానేశాను అండి అని చెప్పాడు.

మరి కొన్ని రోజులు పోయాక ఇక్కడ కూడా జీతం తక్కువ అని పని మానేస్తే ఎలా?అన్నాడు రాజయ్య ‘ జీతం ననీకు కావలసినంత ఇస్తాను కానీ,ఆ రామయ్య వ్యాపారం గురించి నీకు తెలిసిన రహస్యాలు నాకు చెప్పాలి’ అన్నాడు రాజయ్య. ఆ మాటలు విన్న తేజ ‘అది మీరే మెచ్చరు అండీ. నేనలా చెబితే, రేపు మరలా నా వ్యాపార రహస్యాలు మరో చోట చెప్పవని నమ్మకం ఏమిటి?’ అని మీరే అనుమానిస్తారు’ అన్నాడు తేజ. ఆ మాటలకు రాజయ్య నవ్వి ‘నీకు నిజాయితీఉందని చెబుతున్నావు. అదేకాక మంచి తెలివి తేటలు కూడా ఉన్నాయి’ ఈ రోజునుండే పనిలో చేరుదువు గాని అంటూ తేజ కు ఉద్యోగం ఇచ్చాడు రాజయ్య.

Updated Date - Jul 09 , 2024 | 01:17 AM