Share News

Littles : మీకు తెలుసా?

ABN , Publish Date - Jul 28 , 2024 | 05:39 AM

ఈ రోడ్డు ప్రపంచానికి డెడ్‌ ఎండ్‌ ఉత్తర ధృవం దగ్గర ఉన్న ఒక రహదారి. ప్రపంచంలోనే అత్యంత అందమైన, అద్భుతమైన రోడ్డు. దీని మీద ప్రయాణం చేస్తున్నంత సేపూ ఆకాశంలోకి, చందమామ దగ్గరికి వెళుతున్నట్టే ఉంటుంది.

Littles :  మీకు తెలుసా?

Littles : ఈ రోడ్డు ప్రపంచానికి డెడ్‌ ఎండ్‌ ఉత్తర ధృవం దగ్గర ఉన్న ఒక రహదారి. ప్రపంచంలోనే అత్యంత అందమైన, అద్భుతమైన రోడ్డు. దీని మీద ప్రయాణం చేస్తున్నంత సేపూ ఆకాశంలోకి, చందమామ దగ్గరికి వెళుతున్నట్టే ఉంటుంది. ఈ రోడ్డు నార్వేలోఉంది.ఇక్కడికి వస్తే, ప్రపంచయాత్ర ముగిసినట్టే. ఈ ఈ రోడ్డు పేరు 69 హైవేప్రపంచానికి డెడ్‌ ఎండ్‌చెప్పే రహదారిగా ఇది ఎంతో ప్రసిధ్ది చెందినది.

భూమిపై ఇంత చివరి వరకూ వెళ్లే ఈ రోడ్డు ఇదొక్కటే. మంచుతో గడ్డ కట్టిన ఉత్తర ధృవప్రాంతంలో ఒక హైవే నిర్మించాలని 1909లో అనుకున్నారు. కానీ, దీని నిర్మాణం పూర్తి అయింది మాత్రం 1999లో. ధృవ ప్రాంతాల్లో ఈ రోడ్డు వేయడం అంత సులువైన పని ఏమీ కాదు.అందుకే ఈ రహదారిని ఒక ఇంజినీరింగ్‌ అద్భుతంగా భావిస్తారు.


ఇది నార్వేలోని ఓల్డర్‌ ఫోర్ఢ్‌ని, నార్త్‌ కాప్‌ ప్రాంతంతో కలుపుతుంది. శతబ్దాలనుండి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉన్న ప్రాంతాలను ఈ రోడ్డు యూరప్‌తో కలుపుతుంది.

ఈ హైవేపై ప్రయాణిస్తే, మంచి ప్రకృతి సౌందర్యాన్ని చూడవచ్చు. దారి పొడవునా, మంచు కొండలు, గుట్టలు. లోతైన లోయలు ఎత్తైన దేవదారు వృక్షాలు, రెయిన్‌ డీర్స్‌ ఇక్కడ కనువిందు చేస్తాయి. ఈ రోడ్డుపై కొన్ని చోట్ల ఒంటరిగా ప్రయాణించడానికి అనుమతి లేదు గుంపుగా ఉంటేనే అక్కడినుండి వెళ్లడానికి అనుమతి ఉంటుంది.

వందల కిలో మీటర్ల పాటు, సముద్ర తీరంపైన ఈ రోడ్డుపై వెళుతుంటే, పక్కనే ఉన్న చిన్ననేచిన్న గ్రామాలు తీరం వెంట కట్టిన చిన్న పిచ్చుక గూళ్లలాగా కనిపిస్తాయి. ఈ డెడ్‌ ఎండ్‌ వద్ద ఒక సొరంగాన్ని నిర్మించారు. ఇది మెగెరొయాఅనే మరో ద్వీపాన్ని, కలుపుతుంది. ఈ హైవే అంతమయే ప్రాంతాన్ని నార్డికాప్‌ అంటారు. చలికాలంలో ఐతే ఇక్కడి వాతావరణం సంగతి చెప్పనవసరంలేదు ఎలాగూ ఉత్తర ధృవమంతా మంచుతో కప్పబడి పోతుంది.


వేసవిలో సూర్యుడు అస్తమించడు, ఇక చలికాలం అంతా చీకటే ఉంటుంది. ఇక్కడ నివసించే వారికి మిగతా ప్రపంచంతో సంబంధం ఉండదు. వందల యేళ్లనుండి వారు అలాగే జీవిస్తున్నారు. వారంతా సముద్రంలోని చేపలు పీతలను పడుతూ జీవిస్తుంటారు. ఈ ప్రాంతం చేపలకు చాలా ప్రసిధ్ది.

వందల యేళ్లనుండి అనేకులుచేపల వేటకు ఈ ప్రాంతానికి వచ్చేవారు. అట్లాంటిక్‌ సముద్రం ప్రశాంతంతగా ఉన్నపుడు, ఈ రోడ్డు మీద ప్రయాణం అందమైన అనుభూతిని కలిగిస్తుంది. నేరుగా సముద్రంలోకే వెళ్లిపోతున్నామా అనిపించి కొంచెం భయం కూడా వేస్తుంది.

Updated Date - Jul 28 , 2024 | 05:39 AM