ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu: సీఎం అయ్యాక తొలిసారి చంద్రబాబు నోట జగన్ మాట.. ఏమన్నారంటే..?

ABN, Publish Date - Jun 17 , 2024 | 06:16 PM

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రమాణ స్వీకారం చేయడం.. బాబు ఆన్ డ్యూటీ అంటూ రంగంలోకి దిగిపోవడం ఇవన్నీ చకచకానే జరిగిపోతున్నాయి..

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రమాణ స్వీకారం చేయడం.. బాబు ఆన్ డ్యూటీ అంటూ రంగంలోకి దిగిపోవడం ఇవన్నీ చకచకానే జరిగిపోతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత, ప్రమాణ స్వీకారం తర్వాత వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్దగా మాట్లాడని చంద్రబాబు.. ఫస్ట్ టైమ్ బాబు నోట జగన్ మాట వచ్చింది. అది కూడా ఊహించని మాటే వచ్చేసింది. దీంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతుండగా.. వైసీపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.


ఇంతకీ బాబు ఏమన్నారు..?

సోమవారం పోలవరం అంటూ ప్రకటించిన చంద్రబాబు ఇవాళ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. నాలుగైదు గంటలపాటు ప్రాజెక్ట్ అంతా పరిశీలించిన సీఎం.. అనంతరం మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరంను చూసి తీవ్ర బాధ, ఆవేదనకు లోనయ్యారు. ప్రాజెక్ట్ ఈ పరిస్థితికి తెచ్చింది గత ప్రభుత్వమేని కన్నెర్రజేశారు. ఇక తొలిసారి జగన్ గురించి మాట్లాడిన చంద్రబాబు.. ‘వైఎస్ జగన్ రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి వచ్చి ఏపీకి శాపంగా మారారు. ఆయన రాజకీయాల్లోకి రాబట్టే ఇప్పుడు ఈ పరిస్థితి (పోలవరం ప్రాజెక్ట్‌‌కు) వచ్చింది. ఆయన రావడం తప్పు కాదు.. క్షమించరాని నేరం. అప్పటి నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారు. వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టారు. అధికారంలోకి వస్తూనే ఐదు రోజుల్లోనే కాంట్రాక్టు ఏజెన్సీని మార్చేశారు. 2020 వరదల్లో డయాఫ్రం వాల్ 35 శాతం పాడయ్యింది. 480 కోట్లతో అత్యవసరంగా నిర్మిస్తే, దానిని అలా చేశారు. పోలవరం విషయంలో వైఎస్ జగన్ క్షమించరాని తప్పు చేశారు’ అని గట్టిగానే చంద్రబాబు చురకలు అంటించారు.


బాబు మొదలెట్టేసినట్టే!

వాస్తవానికి విమర్శలు, కౌంటర్లకు చంద్రబాబు కాస్త దూరంగానే ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా.. వైఎస్ జగన్ ఇంత ఘోరంగా ఓడిపోయాక ఎక్కడా విమర్శలు కానీ, కనీసం ఆయన మాట కూడా చంద్రబాబు నోట రాలేదు. అయితే.. ఇవాళ పోలవరం ప్రాజెక్టు పరిస్థితి చూశాక తీవ్ర ఆవేదన, బావోద్వేగతంతోనే సీఎం ఇలా మాట్లాడారని రాజకీయ విశ్లేషకులు, టీడీపీ కీలక నేతలు చెబుతున్నారు. సో.. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు ఇప్పుడే మొదలుపెట్టారని అర్థం చేసుకోవచ్చన్న మాట. ఇక మున్ముందు వైఎస్ జగన్‌కు సినిమానే కనిపిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. చంద్రబాబు విమర్శలకు బహుశా వైసీపీ నుంచి కనీసం స్పందన కూడా రాకపోవచ్చని.. మాట్లాడే నేతలే లేరని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో చెప్పుకుంటున్న పరిస్థితి. మున్ముందు చంద్రబాబు ఏ రేంజిలో సినిమా చూపిస్తారో.. ఏమేం జరుగుతాయో వేచి చూడాల్సిందే మరి.

Updated Date - Jun 17 , 2024 | 06:35 PM

Advertising
Advertising